Breaking News Jani Master Granted Bail from High Court
Jani Master : ఇటీవల ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడని కేసు పెట్టడంతో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. ఈ కేసులో జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు. గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ ఈ కేసు విషయంలో చంచల్ గూడా జైలులోనే ఉన్నారు.
ఇటీవల జానీ మాస్టర్ నేషనల్ అవార్డు తీసుకునేందుకు బెయిల్ అప్లై చేసినా రాలేదు. నేషనల్ అవార్డు కూడా జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేలే వరకు ఆపేసినట్టు తెలిపారు. తాజాగా నేడు జానీ మాస్టర్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో జానీ మాస్టర్ త్వరలోనే బయటకు రానున్నారు.
Also Read : Jani Master : జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు..
ఇప్పటికే ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ కి సపోర్ట్ గా అతని కుటుంబం, పలువురు డ్యాన్స్ మాస్టర్స్ మాట్లాడారు. జానీ మాస్టర్ తల్లి హాస్పిటల్ లో ఉంది. దీంతో జానీ మాస్టర్ జైలు నుంచి బయటకి వచ్చాక మీడియా ముందుకు వచ్చి ఈ కేసు గురించి మాట్లాడతారా లేదా అని చర్చగా మారింది.