×
Ad

Malla Reddy : బాలీవుడ్ పని అయిపోయింది.. తెలుగువారు ఏలబోతున్నారు.. మల్లారెడ్డి కామెంట్స్ వైరల్

యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట చర్చినీయాంశంగా మారింది.

  • Published On : November 28, 2023 / 11:46 AM IST

BRS Minister Chamakura Malla Reddy comments at Animal Pre Release event gone viral

Malla Reddy : సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నైట్ హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్‌తో పాటు చీఫ్ గెస్టులుగా మంత్రి మల్లారెడ్డి, మహేష్ బాబు, రాజమౌళి కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్‌లో మల్లారెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్ ఆడియన్స్ ఆ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు..?

“రణబీర్ కపూర్ వినండి.. రానున్న ఐదేళ్లలో తెలుగువారు హాలీవుడ్, బాలీవుడ్‌ని ఏలుతారు. ముంబై, బాలీవుడ్ పని అయిపోయింది. బెంగళూరు ఏమో ట్రాఫిక్ జామ్ మయం. మీరు హైదరాబాద్ వచ్చేయండి. హైదరాబాద్ సిటీ దేశంలోని గొప్పదిగా ఎదుగుతుంది. మా దగ్గర రాజమౌళి, దిల్ రాజు, సందీప్ వంగా వంటి తెలివైన వారు ఉన్నారు. పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో మీకు తెలుసు. ప్రస్తుతం తెలుగువారి అశ్వమేధ యాగం జరుగుతుంది” అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Also read : Alia Bhatt : అలియా భట్ డీప్‌ఫేక్ వీడియో.. అసలు తప్పు వాళ్లదే అంటున్న నెటిజెన్స్..

ఇక వ్యాఖ్యలే బాలీవుడ్, ముంబై జనాలకు ఆగ్రహం కలిగించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ కామెంట్స్ ని ఖండిస్తున్నారు. బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కేఆర్‌కే కూడా ఈ విషయం గురించి ఒక ట్వీట్ చేశారు. “సార్ మీరు భ్రమపడుతున్నారు. మీ తెలుగు స్టార్స్ బాలీవుడ్ ఫిలిమ్స్ లో విలన్స్ గా నటిస్తున్నారు. వారూ హీరోలు కాదు” అంటూ ట్వీట్ చేశారు. కొందరు బి-టౌన్ అభిమానులు.. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.