DeepFake Video : అలియా భట్ డీప్‌ఫేక్ వీడియో.. అసలు తప్పు వాళ్లదే అంటున్న నెటిజెన్స్..

ఎన్ని రూల్స్ తీసుకు వచ్చినా డీప్‌ఫేక్ ఆగడాలు ఆగడం లేదు. ఈసారి అలియా భట్ వీడియో వైరల్. వీటన్నిటికీ అసలు కారణం వారే అంటున్న నెటిజెన్స్..?

DeepFake Video : అలియా భట్ డీప్‌ఫేక్ వీడియో.. అసలు తప్పు వాళ్లదే అంటున్న నెటిజెన్స్..

Bollywood Actress Alia Bhatt DEEPFAKE VIDEO gone viral

Updated On : November 28, 2023 / 11:48 AM IST

Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కి సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కొన్నిరోజులు క్రితం మరో బాలీవుడ్ భామ కాజోల్ డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోతో నేషనల్ వైడ్ ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. ఇలాంటి ఆగడాలను అడ్డుకోకపోతే ఆడవాళ్లు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఇక ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోని.. సోషల్ మీడియా వేదికలకు కొత్త రూల్ రిమైండర్లను పంపింది. వాటిని అధిగమిస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుందంటూ ప్రకటించారు. అయినాసరి డీప్‌ఫేక్ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అసలు ఈ తప్పు ఎవరిది..? ఇది తప్పు అని తెలిసినా చేస్తున్నవారిదా..? లేక ఈ తప్పుని అడ్డుకోలేకపోతున్న ప్రభుత్వానిదా..? ఈ రెండు ప్రశ్నలకు బదులిస్తూనే మరొకరు చేస్తున్న తప్పుని కూడా భయపెడుతున్నారు కొందరు నెటిజెన్స్.

Also read : Mahesh Babu : యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ కపూర్‌తో కలిసి మహేష్ బాబు డాన్స్..

డీప్‌ఫేక్ వీడియోలు చేసే వారిది ఎంత తప్పు ఉంటుందో..? సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటూ చెప్పుకుంటూ.. నెట్టింట మరి దారుణంగా వీడియోలు పోస్టులు చేస్తున్న వారిది కూడా అంతే తప్పు ఉంటుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఈ డీప్ ఫేక్ వీడియో వల్ల బాధపడిన వారిపై సానుభూతి చూపించడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు నెటిజెన్స్.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఇలాగే ఉండాలని.. తాము ఏమి రూల్స్ చెప్పడం లేదని, కానీ ఎంతోకొంత రెస్పాన్సిబిలిటీ అనేది వారికీ ఉండాలని గుర్తు చేస్తున్నారు. వారు రెస్పాన్సిబుల్ గా ఉంటే ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది కదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్స్ పలువురుని ఆలోచించేలా చేస్తుంది. మరి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ కామెంట్స్ ని రెస్పాన్సిబుల్ గా తీసుకుంటారా..? లేదా..? అనేది చూడాలి.