Ram Charan : RC16 సాంగ్స్ అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఆల్రెడీ మూడు సాంగ్స్..

RC16 సాంగ్స్ అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసిన ఏ ఆర్ రెహమాన్ ఆల్రెడీ మూడు సాంగ్స్..

Ram Charan : ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘RC16’. ఇటీవలే ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్టుప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మ్యూజిక్ గురించి దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఆల్రెడీ రెహమాన్ మూడు సాంగ్స్ ని కంపోజ్ చేసేశారట. మూడు పాటలు బాగా వచ్చాయని, మొదటి సాంగ్ నుంచి ప్రతిదీ బాగా ఎంజాయ్ చేస్తారని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. ఉప్పెనకి దేవిశ్రీ ప్రసాద్ ఏ రేంజ్ లో ఇచ్చారు. అంతకుమించి రేంజ్ లో ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ ఇస్తున్నారని బుచ్చిబాబు పేర్కొన్నారు.

Also read : Ram Charan : ఆడబిడ్డని కాపాడడం కోసం.. చరణ్‌కి అర్ధరాత్రి ఫోన్ చేసి డబ్బులు అడిగా.. మంచు మనోజ్

ఇక ఈ అప్డేట్ తో చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఏ ఆర్ రెహమాన్ తెలుగులో చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందించారు. మొదటిసారి బాలయ్య ‘నిప్పురవ్వ’ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసి తెలుగు ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వెంకటేష్ ‘సూపర్ పోలీస్’, రాజశేఖర్ ‘గ్యాంగ్ మాస్టర్’ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసారు. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు.

ఆ తరువాత తరుణ్ ‘నీ మనసు నాకు తెలుసు’, మహేష్ బాబు ‘నాని’, నాగచైతన్య ‘ఏ మాయ చేసావే’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’కి సంగీతం అందించారు. వీటిలో తరుణ్, నాగచైతన్య సినిమాలు మాత్రమే హిట్స్ గా నిలిచాయి. మరి తెలుగులో సరైన సక్సెస్ రేట్ లేని ఏ ఆర్ రెహమాన్.. RC16తో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు