Buchibabu Sana : నెక్స్ట్ టైం అయినా పేమెంట్ ఇవ్వండి.. బుచ్చిబాబు కౌంటర్.. తల పట్టుకున్న నిర్మాత..
తాజాగా బుచ్చిబాబు మౌళి హీరోగా నటించిన దొంగ నా కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. (Buchibabu Sana)
- Saketh U
- Published on- November 12, 2026 / 08:10 AM IST
Buchibabu Sana
Buchibabu Sana : ఉప్పెన, పెద్ది సినిమాలతో దర్శకుడిగా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు బుచ్చిబాబు సాన. అయితే బుచ్చిబాబు ఖాళీగా ఉంటే చాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరవుతారు. ముఖ్యంగా మైత్రి నిర్మాణ సంస్థ ఈవెంట్స్ కి రెగ్యులర్ గా హాజరవుతాడు బుచ్చిబాబు. తాజాగా బుచ్చిబాబు మౌళి హీరోగా నటించిన దొంగ నా కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు.
ఈ ఈవెంట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. రవి సర్(మైత్రి నిర్మాత) మీరు పిలిస్తే రాకపోతే తిడతారు, కొడతారు అని ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి పిలిచినా పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తుంది. ఈవెంట్ కి పదివేలు ఇచ్చినా ఈ పాటికి కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడిని. ఫ్రీగా వస్తున్నాను ప్రతి సినిమా ఈవెంట్ కి. నెక్స్ట్ టైం అయినా పేమెంట్ ఇచ్చేలా చూడండి అని అన్నారు.
Also Read : Varanasi : వారణాసి సినిమాకు 500 కోట్లు ఇస్తున్నారా? రిలీజ్ కి ముందే కొత్త రికార్డ్..?
అయితే బుచ్చిబాబు సరదాగానే ఈ మాటలు అన్నాడు. బుచ్చిబాబు మాటలకు నిర్మాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటూ నవ్వుకుంటూనే తల పట్టుకున్నాడు.
