V Hanumantharao : 9 ఏళ్ళ క్రితం వివాదం.. అర్జున్ రెడ్డి సినిమాపై మరోసారి వి హనుమంతరావు వ్యాఖ్యలు..
9 ఏళ్ళ తర్వాత మరోసారి వి హనుమంతరావు అర్జున్ రెడ్డి వివాదంపై మరోసారి మాట్లాడారు. (V Hanumantharao)
V Hanumantharao
V Hanumantharao : విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా రిలీజయినప్పుడు లిప్ కిస్ ఉన్న పోస్టర్స్ బస్సుల మీద అంటించి బోల్డ్ ప్రమోషన్స్ చేసారు. అప్పట్లో అది వివాదంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అప్పట్లోనే అర్జున్ రెడ్డి సినిమాపై తీవ్ర విమర్శలు చేసారు, న్యూస్ ఛానల్స్ కి ఇంటర్వ్యూకి వెళ్లి ఇదేం సినిమా, యువతని తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. విజయ్ దేవరకొండ కూడా చిల్ తాతా అంటూ వి హనుమంతరావు కి కౌంటర్ ఇచ్చాడు అప్పుడే.
అయితే ఈ ఘటన జరిగిన 9 ఏళ్ళ తర్వాత మరోసారి వి హనుమంతరావు అర్జున్ రెడ్డి వివాదంపై మరోసారి మాట్లాడారు. తాజాగా చంద్రయాన్ అనే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో హనుమంతరావు మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి అనే ఒక సినిమా చూసాను. ఆ సినిమా పోస్టర్స్ బస్సుల మీద అంటించడం వల్ల యంగర్ జనరేషన్ కి చెడు ఆలోచనలు వస్తాయి. సినిమా పోస్టర్ ఎలా ఉందంటే చెప్పలేం. సినిమాలో ఏవైనా చూపించుకో వద్దనం. కానీ బస్సుల మీద అంటించడం వల్ల అందరు చూసి తప్పుగా ఆలోచించి మాట్లాడతారు. దానివల్ల పిల్లలకు, మహిళలకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఆ రోజు సినిమా ఎలా రిలీజ్ చేస్తారు, సెన్సార్ ఎలా ఇచ్చారు అని గొడవ చేశాను.
బస్సులకి పోస్టర్స్ ఇస్తే డబ్బులు వస్తాయి అని అలాంటివి పెట్టొద్దు అని అన్నాను. తర్వాత నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఆ పోస్టర్స్ చూస్తూ అటు ఇటు చూసి యాక్సిడెంట్ లు కూడా అవుతాయి. నన్ను కలిపిస్తా అన్నారు విజయ్ దేవరకొండ ని. నేను కలవలేదు. నేను అడ్జస్ట్ అయిపోయాను అన్నారు. ఇదేమి పంచాయితీ. కానీ విజయ్ అదృష్టం బాగుంది ఆ సినిమా బాగా ఆడింది అని అన్నారు. అప్పట్లో వి హనుమంతరావు అర్జున్ రెడ్డి వివాదం పెద్దగానే అయింది. మరి ఇప్పుడు దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
అర్జున్ రెడ్డి’ రిలీజ్ టైమ్లో చేసిన రచ్చపై వీహెచ్ క్లారిటీ.. అసలు ఏం జరిగిందంటే?
“సినిమాల్లో ఏమైనా చూపించుకోండి.. పోస్టర్లలో మాత్రం ఏది పడితే అది పెట్టొద్దు!” వీహెచ్ క్లారిటీ! – #HanumanthaRao
#Chandrayan Pre-Release Event https://t.co/S9cIl2zLhR
— Telugu70mm (@Telugu70mmweb) November 11, 2026
