Butta Bomma: టాలీవుడ్లో ఇటీవల ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ మూవీగా రిలీజ్ అయిన ‘బుట్టబొమ్మ’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అనిఖ సురేంద్ర, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ మంచి ప్రమోషన్స్ కూడా చేసింది.
Buttabomma Review : బుట్టబొమ్మ రివ్యూ.. రీమేక్ సినిమా అయినా.. వాళ్ళిద్దరికోసం చూడొచ్చు..
ఇక థియేటర్లలో రిలీజ్ అయిన బుట్టబొమ్మ మూవీకి అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో చిత్ర యూనిట్ నిరాశకు లోనయ్యింది. కాగా, ఈ సినిమాను థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఖచ్చితంగా ఓటీటీలో ఈ సినిమాను ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Buttabomma: రిలీజ్ వాయిదా వేసుకున్న బుట్టబొమ్మ.. ఎప్పుడు వస్తుందంటే..?
కాగా, ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. మరి ఈ సినిమాకు ఓటీటీలో ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.