Buttabomma Review : బుట్టబొమ్మ రివ్యూ.. రీమేక్ సినిమా అయినా.. వాళ్ళిద్దరికోసం చూడొచ్చు..

బాలనటిగా తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో మెప్పించిన అనికా సురేంద్రన్ తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా అరంగ్రేటం చేసింది. తమిళ్ సినిమాలతో తెలుగు వాళ్ళని కూడా మెప్పించి, తన వాయిస్ తో అభిమానులని సంపాదించుకున్న అర్జున్ దాస్, మరో నటుడు సూర్య వసిష్ఠ మెయిన్ లీడ్స్ లో బుట్టబొమ్మ సినిమా................

Buttabomma Review : బుట్టబొమ్మ రివ్యూ.. రీమేక్ సినిమా అయినా.. వాళ్ళిద్దరికోసం చూడొచ్చు..

Anikha Surendran Buttabomma Movie Review

Buttabomma Review : బాలనటిగా తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో మెప్పించిన అనికా సురేంద్రన్ తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా అరంగ్రేటం చేసింది. తమిళ్ సినిమాలతో తెలుగు వాళ్ళని కూడా మెప్పించి, తన వాయిస్ తో అభిమానులని సంపాదించుకున్న అర్జున్ దాస్, మరో నటుడు సూర్య వసిష్ఠ మెయిన్ లీడ్స్ లో బుట్టబొమ్మ సినిమా తెరకెక్కింది. శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ బుట్టబొమ్మ సినిమా మలయాళం కప్పేలా సినిమాకి రీమేక్. మలయాళంలో కప్పేలా సినిమా మంచి విజయం సాధించింది. బుట్టబొమ్మ సినిమా ఫిబ్రవరి 4న థియటర్స్ లో రిలీజయింది ఈ సినిమా. సినిమాకి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు.

ఇది కప్పేలా రీమేక్ కావడంతో ఈ సినిమా ఇప్పటికే చాలామంది తెలుగువాళ్లు కూడా చూశారు. కథ విషయానికి వస్తే.. పల్లెటూళ్ళో ఉండే ఓ అమ్మాయికి(అనికా) అనుకోకుండా ఓ అబ్బాయి(సూర్యవసిష్ఠ) నుంచి రాంగ్ కాల్ వస్తుంది. ఆ రాంగ్ కాల్ పరిచయం స్నేహంగా మారి అనంతరం ప్రేమగా మారుతుంది. అతన్ని ఓ రోజు కలవడానికి పట్నం వెళ్తుంది. అయితే ఆ అబ్బాయి ఫోన్ ఇంకొకరికి (అర్జున్ దాస్) దొరకడంతో అనికా అర్జున్ ని కలుస్తుంది కానీ అంతలోనే సూర్య అనికాని కనుక్కొని వస్తాడు. ఇద్దరూ సరదాగా సిటీలో తిరుగుతుంటే అర్జున్ ఫాలో అవుతాడు. దీంతో సూర్య, అర్జున్ తో గొడవపడతాడు. తర్వాత సూర్య, అనికా ఎక్కడికి వెళ్లారు? అర్జున్ ఎవరు? వీళ్ళిద్దరిలో హీరో ఎవరు? విలన్ ఎవరు? అని క్లైమాక్స్ వరకు సాగుతుంది. క్లైమాక్స్ లో ఉండే ఒకేఒక ట్విస్ట్ సినిమాకి చాలా ప్లస్. అదేంటి అనేది థియేటర్ లో చూడాల్సిందే.

Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ రివ్యూ.. అమ్మకోసం.. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..

మలయాళం లో ఈ ట్విస్ట్ వల్లే సినిమా హిట్ అయింది. అయితే తెలుగు వాళ్ళు కప్పేలా సినిమా చూస్తే ఉన్న ఒక్క ట్విస్ట్ తెలిసి కాబట్టి ఈ సినిమా అంతగా అనిపించదు. అనికా, అర్జున్ దాస్ కోసమే ఈ సినిమా చూడొచ్చు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. సీరియల్ నటి నవ్య స్వామి కూడా ఓ పాత్ర పోషించింది ఇందులో. కెమెరా వర్క్ బాగుంది. మలయాళం సినిమాని తీసుకున్నా తెలుగు నేటివిటీకి మార్చాలని చూశారు. అయినా కొన్నిచోట్ల మలయాళం వాసన కనిపిస్తుంది. ఓటీటీల హవా నడుస్తున్న రోజుల్లో అది కూడా హిట్ అయిన ఓ సినిమాని తీసుకొని రీమేక్ చేయడం అంటే సాహసమే. బుట్టబొమ్మకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కలెక్షన్స్ ఆలోచించాల్సిందే.