Shivani Nagaram : తిరుమల దర్శనం వివాదం.. మీరు కూడా చేసుకోవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
తాజాగా శివాని ఈ వివాదంపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. (Shivani Nagaram)
Shivani Nagaram
- 15 నిముషాలు తిరుమల దర్శనం
- శివాని నగరం కామెంట్స్ వైరల్
- క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Shivani Nagaram : వరుసగా మూడు సినిమాలతో హిట్స్ కొట్టి దూసుకుపోతుంది హీరోయిన్ శివాని నగరం. ఇటీవల తన హే బల్వంత్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివాని.. హీరోయిన్ అయ్యాక లిటిల్ హార్ట్స్ సినిమా హిట్ అయ్యాక తిరుమల వెళ్తే కొంచెం సేపు ద్వారం దగ్గర నిల్చోబెడతాం అని చెప్పారు. 15 నిమిషాల పాటు నన్ను ఎవరూ కదల్పలేదు. 15 నిముషాలు స్వామివారిని దర్శించుకున్నాను. మా అమ్మ కూడా నాతో పాటు ఉంది. స్వామి వారికీ వేసిన వస్త్రాలతో నన్ను ఆశీర్వదించారు అని చెప్పింది.
అయితే సామాన్య జనాలకు 5 సెకండ్స్ కూడా దర్శనం దొరకని తిరుమలలో ఇలా ఒక హీరోయిన్ కి 15 నిముషాలు ఎలా దర్శనం దొరికింది అని పలువురు నెటిజన్లు, భక్తులు టీటీడీని ప్రశిస్తు పోస్టులు చేసారు. దీంతో ఇది వివాదంగా మారింది. తాజాగా శివాని ఈ వివాదంపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
శివాని నగరం రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా నా స్పిరిచ్యువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. కేదార్నాథ్, రామకోటి రాయడం, షిరిడి, తిరుపతి ఇవన్నీ చెప్పాను. కానీ నేను తిరుమలలో 15 నిముషాలు దర్శనం తీసుకున్నాను అని చెప్పింది హైలెట్ అవుతుంది. దానికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 2025 అక్టోబర్ లో నేను 10,500 రూపాయలు కట్టి శ్రీవాణి దర్శనం టికెట్ నేను మా అమ్మ లైన్లో నిల్చొని తీసుకున్నాము. ఆ టికెట్స్ తోనే మేము దర్శనం చేసుకున్నాము. 15 నిముషాలు అని చెప్పింది మనం స్వామి వారి లైన్ లో ఎంటర్ అయిన దగ్గర్నుంచి స్వామివారిని చూసి వెళ్లిపోయేంతవరకు కొంచెం కొంచెంగా కనిపిస్తారు. అదంతా కలిపి నేను 15 నిముషాలు అని చెప్పాను.
అంతే కానీ 15 నిముషాలు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు. అంతకుముందు కూడా నేను సర్వదర్శనం 300 రూపాయలు టికెట్స్ తీసుకొని ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు 5 సెకండ్స్ స్వామివారిని చూడటం జరిగింది. నా లైఫ్ లో 13 ఏళ్ళ తర్వాత స్వామివారిని దర్శించుకున్నాను. అంత దగ్గరగా చూడటం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయి సంతోషంతో షేర్ చేసుకున్నాను. కానీ అది కొంచెం మిస్ లీడింగ్ గా వెళ్తుంది. నాకే కాదు మీలో ఎవరైనా సరే శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే కచ్చితంగా స్వామివారి దర్శనం దగ్గరగా, చాలా మంచిగా జరుగుతుంది. నాలాగే మీరు కూడా అనుభూతి చెందుతారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలి అనేది నా బాధ్యత. ఇది నా టికెట్ అంటూ తన శ్రీవాణి దర్శనం టికెట్ కూడా చూపించింది.
Also Read : Nani : డ్యాన్స్ కాపీ కొట్టిన నాని.. ఆయా షేర్ స్టెప్స్ కాపీనా..? ఒరిజినల్ స్టెప్స్ నావే అంటూ అతను పోస్ట్..
View this post on Instagram
