Baby Movie : బేబీ మూవీ పై దర్శకుడు బీవీఎస్ రవి వైరల్ ట్వీట్.. మీరు ఇడియట్స్‌, దురదృష్టవంతులు..!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన బేబీ మూవీ పై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బీవీఎస్ రవి వైరల్ ట్వీట్ చేశాడు. మీరు ఇడియట్స్‌..? దురదృష్టవంతులు..?

BVS Ravi viral tweet on Anand Deverakonda Baby Movie

Baby Movie : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ మూవీకి కథని అందించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. SKN నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రెజెంట్ లవ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కింది. ట్రై‌యాంగులర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ నేడు జులై 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి షోతోనే మంచి సక్సెస్ టాక్ తెచ్చుకొని హిట్ దిశగా వెళ్తుంది.

Vishwak Sen : ఆహాలో విశ్వక్ సేన్ 15 ఎపిసోడ్స్‌తో కొత్త షో.. త్వరలోనే స్టార్ కాబోతుంది..!

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ గురించి ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బీవీఎస్ రవి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. “మీరు ఇడియట్స్‌..? దురదృష్టవంతులు..? అనేది నాకు అర్ధంకావడం లేదు ఈ మూవీని సమ్మర్ లోనే రిలీజ్ చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ చూసేవాళ్లు” అంటూ మూవీ టీంని కొంచెం డిఫరెంట్ గా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాల్సింది. కానీ మూవీ టీం ఎందుకో పోస్ట్‌పోన్ చేసింది. కాగా ఈ సినిమాని నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీమియర్ వేయగా.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ర‌ష్మిక మంద‌న్న(Rashmika Mandanna), రాశీ ఖ‌న్నా(Raashii Khanna) ప‌లువురు సీని ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Alia Bhatt : కెమెరా మెన్ చెప్పు పట్టుకున్న అలియా భట్.. వీడియో వైరల్!

ప్రీమియ‌ర్‌ను వీక్షించిన త‌రువాత విజ‌య్‌, రాశీ ఖ‌న్నాలు మీడియాతో మాట్లాడగా.. ర‌ష్మిక మాత్రం మీడియాకు థంబ్స్‌-అప్ సింబ‌ల్ చూపిస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. బేబీ సినిమా చూసి థియేటర్ లో నుంచి బయటకి వచ్చిన క‌న్నీళ్లు తుడుచుకుని కాస్త ఎమోష‌న‌ల్‌గానే కనిపించింది. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.