Canada car repairing company use Prabhas Michi movie scene for promotions
Prabhas : ప్రభాస్ స్టార్‌డమ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపుని సంపాదించుకున్నారు. దీంతో ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సూపర్ ఫేమ్ లభించింది. దీంతో ప్రభాస్ సినిమాలకు కూడా మంచి ఆదరణ వస్తుంది. ఇక ఈ స్టార్‌డమ్ ని ఉపయోగించుకొని కెనడాకి చెందిన ఓ కారు రిపేరింగ్ సంస్థ ప్రమోషన్స్ చేసుకుంటుంది.
కెనడాలోని ఓ థియేటర్ లో సినిమాకి మధ్య కమర్షియల్ యాడ్స్ ప్లే చేస్తున్నారు. ఈక్రమంలోనే ‘URBAN AUTO COLLISION’ అనే కెనడా కారు రిపేరింగ్ సంస్థకి సంబంధించిన యాడ్ ని కూడా ప్లే చేశారు. ఇక ఈ యాడ్ ని ప్రభాస్ మిర్చి మూవీ సీన్ తో డిజైన్ చేసి ప్లే చేశారు. మిర్చి సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సీన్ లో ప్రభాస్.. ‘కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ పక్కనే ఉన్న కారుని కాలుతో తన్నగా, ఆ కారు టైర్ ఊడిపోతుంది.
Also read : Vishal – Prabhas : ప్రభాస్‌ని హీరోగా పెట్టి డిఫరెంట్ జోనర్‌లో.. సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న విశాల్..
ఇక ఈ సీన్ ని చూపిస్తూ.. కారు రిపేర్ అవ్వగానే తమని సంప్రదించండి అంటూ అర్బన్ ఆటో కొల్లిసిన్ యాడ్ ని డిజైన్ చేయించుకున్నారు. ఇక ఈ యాడ్ ని థియేటర్ లో చూసిన తెలుగు ఆడియన్స్ షాక్ అయ్యి.. దానిని వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. మిర్చి మూవీలో బ్రహ్మానందం చెప్పిన.. ‘అబ్బా ఏం వాడకం అయ్యా’ అనే డైలాగ్ ని కామెంట్ చేస్తున్నారు.
Idekkadi Vaadakam ra Babu ??#Prabhas #Mirchi @ThisIsDSP pic.twitter.com/Cvtr6Po9Tt
— Dps Nayak ™ ? (@NayakTweetz) April 18, 2024
కాగా కెనడా ప్రభాస్ కి మంచి స్టార్‌డమ్ ఉంది. గతంలో అక్కడ న్యూస్ పేపర్స్ లో సలార్ సినిమా గురించి ప్రత్యేక ఆర్టికల్ రాయడం గమనార్హం. సలార్ సినిమా రిలీజ్ సమయంలో కూడా అక్కడి ఆడియన్స్ తెగ హంగామా చేశారు.