Care of Kancharapalem director Venkatesh Maha reacts on KGF controversy
Venkatesh Maha : ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ‘వెంకటేష్ మహా’. కాగా ఈ దర్శకుడు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహాతో పాటు టాలీవుడ్ లోని దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా.. సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి.
Venkatesh Maha : కేజీఎఫ్ మూవీ పై కంచరపాలెం దర్శకుడు సంచలన కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!
సినిమా లాస్ట్ లో తవ్వినవాళ్లకి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చి, ఆ బంగారాన్ని అంతా తీసుకోని వెళ్లి సముద్రంలో పడేసే ఒక నిచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాము అంటూ కేజీఎఫ్ చిత్రాన్ని ఉదేశిస్తూ వైరల్ కామెంట్స్ చేశాడు. దీంతో వెంకటేష్ మహా మాటలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో నెటిజెన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. మీకు నచ్చలేదని మీ తోటి దర్శకుడి ప్రతిభని డీగ్రేడ్ చేసి మాట్లాడడం తప్పు అంటున్నారు. ఇక ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తుండడంతో వెంకటేష్ మహా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
అయితే ఇప్పటికే తన మాటలన్నీ సమర్ధించుకుంటేనే చెప్పుకొచ్చాడు. తాను ఇప్పటికి ఆ మాటలు పైనే నిలబడుతున్నట్లు తెలియజేశాడు. తనకి లాగానే కేజీఎఫ్ చిత్రం చాలామందికి నచ్చలేదని, వాళ్ళందరూ తన మాటలు కరెక్ట్ అంటూ నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. వారందరి తరుపు నుంచే నేను వాయిస్ వినిపిస్తున్నాను. కాకపోతే నేను ఉపయోగించిన పదాలు కరెక్ట్ కాదు. ఆ పదాలు కూడా నేను ఒక రియల్ పర్సన్ ని అనలేదు. ఒక రీల్ పర్సన్ గురించే నేను అలా మాట్లాడాను. కానీ మీరందరు రియల్ పర్సన్ ని అయిన నన్ను దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. క్షమాపణలు అడగడం మానేసి సమర్ధించుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నెటిజెన్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు.
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023