Music Director : కార్మేని సెల్వం మ్యూజిక్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్.. మ్యూజిక్ సంస్థకు పేరు వచ్చేలా..
తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ ఎంకే సినిమా గురించి, ఈ సినిమాలో సంగీతం గురించి మీడియాతో మాట్లాడారు. (Music Director)
- Saketh U
- Published On : March 31, 2026 / 08:00 AM IST
Carmeni Selvam
Music Director : పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కార్మేని సెల్వం’. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో రామానుజన్ ఎంకే తమ సంస్థ ద్వారా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ ఎంకే సినిమా గురించి, ఈ సినిమాలో సంగీతం గురించి మీడియాతో మాట్లాడారు.
Also Read : Nani Son Arjun Birthday : నాని కొడుకు అర్జున్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన నాని భార్య..
మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ ఎంకే మాట్లాడుతూ.. ఒక సినిమాకు సంగీతాన్ని అందించిన ఘనత ఒక వ్యక్తికి కాకుండా ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో ‘Musicloud Studio & Technology’ని ప్రారంభించాను. మొదట్లో కార్పొరేట్ ప్రాజెక్టులు చేస్తూ ఆ తర్వాత సౌండ్ డిజైన్, వాయిస్ ఓవర్లు, డబ్బింగ్.. చేస్తూ ఇప్పుడు సినిమాలకు చేస్తున్నాము. మేము చేసిన ‘కార్మేని సెల్వం’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడి పేరు కాకుండా మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ఇటీవల సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. అది తగ్గించడానికి ఉన్న మార్గాలలో సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించడం ఒకటి. సినిమా నిర్మాతలకు మ్యూజిక్ క్లౌడ్ స్టూడియోకు మధ్య ఒక రెవెన్యూ మోడల్ తయారుచేశాం. ఈ నమూనా కింద, సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యకారులు, ప్రోగ్రామర్లు సహా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేము సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకువస్తున్నాము అని తెలిపారు.
కార్మేని సెల్వం సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం 4 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, OST ట్రాక్స్ కంపోజ్ చేశాము. మా మ్యూజిక్ క్లౌడ్ టీమ్‌లో 4-5 మంది కలిసి పనిచేస్తున్నాం. ఈ సినిమాలోని ‘అరెరె..’ సాంగ్ కి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. తండ్రి-కొడుకు మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఎమోషనల్, ఫ్యామిలీ సినిమాలకు మ్యూజిక్ చేయడం చాలా కష్టం. కనీసం 10 మంచి, అర్థవంతమైన సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలని నా కోరిక. ఆనంద్, గోదావరి.. లాంటి మంచి కథలు, మంచి సినిమాల్లో భాగం అవ్వడం నా లక్ష్యం అని తెలిపారు.
Also Read : Niharika : నన్ను అనేవాళ్ళు అంటూనే ఉంటారు.. నేను చేసేది చేస్తూనే ఉంటా.. నిహారిక కామెంట్స్ వైరల్..
