Carmeni Selvam: జీవితాన్ని చూసే కొత్త కోణం ‘కార్మేని సెల్వం’.. హైదరాబాద్‌లో ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్.

హైదరాబాద్ లో ఘనంగా జరిగిన 'కార్మేని సెల్వం(Carmeni Selvam)' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.

Karmeni Selvan Trailer Launch Event Held Grandly in Hyderabad

Carmeni Selvam: తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం(Carmeni Selvam)’. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు శివ ప్రసాద్, ధనరాజ్, తేజ కాకుమాను అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

Rashmi Gautam: కాశీ విశ్వేశ్వరుడి సేవలో యాంకర్ రష్మీ.. డివోషనల్ ఫొటోలు వైరల్

ఈ సందర్భంగా నటుడు సముద్రఖని మాట్లాడుతూ, జీవితాన్ని చూసే కోణాన్ని ఈ చిత్రం చాలా వినూత్నంగా ఆవిష్కరిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే అప్పులు, ఈఎమ్‌ఐల భారం నుంచి విముక్తి పొందితేనే కలలను నిజం చేసుకోగలమనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు రామ్ చక్రిని ఒక ఇంటెన్స్ క్రియేటర్‌గా అభివర్ణిస్తూ, లక్ష్మీ ప్రియా, అభినయల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ కథకు కనెక్ట్ అవుతుందని, సముద్రఖని పాత్రలోని వైవిధ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పారు. రామానుజం అందించిన సంగీతం, నిర్మాత అరుణ్ సహకారం సినిమాను అద్భుతంగా మలిచాయని ఆయన తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛతో, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది.