కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం : ముద్దు ఫోటో షేర్ చేసిన నటి..

కరోనా ఎఫెక్ట్ : మాస్కులతో ముద్దు పెట్టుకున్న నిత్యా రామ్, గౌతమ్..

  • Publish Date - March 23, 2020 / 07:35 AM IST

కరోనా ఎఫెక్ట్ : మాస్కులతో ముద్దు పెట్టుకున్న నిత్యా రామ్, గౌతమ్..

మార్చి 22 (ఆదివారం) కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా భారత ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ తో యావత్‌ భారతావనిని ఏకతాటిపైకి వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోడీ పిలుపు మద్దతుగా నిలిచి.. ఇళ్లకే పరిమితమయ్యారు.

జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి ప్రజలంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. అయితే ఓ నటి మాత్రం వెరైటీగా కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం అంటూ పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. ‘నందిని’ సీరియల్‌ ద్వారా పాపులర్‌ అయిన బుల్లితెర నటి నిత్యారామ్‌ ఆస్ర్టేలియాకు చెందిన గౌతమ్‌ అనే బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకుంది.

కరోనా వైరస్‌ కారణంగా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. అయితే నిత్యారామ్‌, ఆమె భర్త మాస్కులు ధరించి ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ.. ‘కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం’ అంటూ కొటేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

See Also |  లాక్ డౌన్ అంటే ఏంటి? ఎక్కడ అమలవుతోంది?