ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్‌పై కడప జిల్లాలో కేసు పెట్టారు ఉప్పర కులస్థులు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరిచి మాట్లాడారంటూ కళ్యాణీ మాలిక్‌పై సగర (ఉప్పర) కుల సంఘం నాయకులు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ మేరకు కడప జిల్లా అధ్యక్షుడు మాదాసు మురళి, సంఘం నాయకులతో కలిసి ప్రొద్దుటూరు టూటౌన్ ఎస్‌ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
తాజాగా లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాకు సంగీతం అందించిన కళ్యాణీ మాలిక్.. ఓ టీవీ చర్చ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ మాట్లాడుతూ.. ఉప్పర కులస్థులను కించపరుస్తూ ‘ఉప్పరసోదీ’, ‘ఉప్పర పనికిమాలిన సోదీ’ అంటూ మాట్లాడారని, ఆయన మాట్లాడిన మాటలు తమను కించపరిచేలా ఉన్నాయని, ఆతనిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. వెంటనే కళ్యాణీ మాలిక్‌ను అరెస్ట్ చేయాలని సగర (ఉప్పర) కులస్థులు కోరారు. కాగా గతంలో ఉప్పర అనే పదం వాడి కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదంటూ కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే