యామిని – స్మితలతో విజయ్ రొమాన్స్

'వరల్డ్ ఫేమస్ లవర్' - క్యాథరిన్, రాశీ ఖన్నాలుక్స్ రిలీజ్..

  • Publish Date - December 16, 2019 / 08:04 AM IST

‘వరల్డ్ ఫేమస్ లవర్’ – క్యాథరిన్, రాశీ ఖన్నాలుక్స్ రిలీజ్..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover).. 
సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు.

రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఎజిబెల్లా, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ నాలుగు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. లంగాణ అమ్మాయి సువర్ణగా ఐశ్వర్యా రాజేష్‌.. ఫ్రెంచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇజా పాత్రలో నటిస్తోన్న ఇజా బెల్లె లియెతె లుక్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్‌ తాజాగా రాశీ ఖన్నా, కేథరిన్ లుక్స్ రిలీజ్ చేసింది. ఇందులో క్యాథరిన్‌కు సింగరేణి ప్రాంతానికి లింక్‌ ఉంది. ఆమె విజయ్‌ను శ్రీనుగా సంబోధిస్తుంది.

పాత్ర పరంగా సింగరేణి ప్రాంతంతో తనకున్న రిలేషన్‌ గురించి “బొగ్గు గనిలో నా బంగారం, నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఈ వేలంటెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శ్రీనును కలుసుకుందాం” అంటూ క్యాథరిన్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని సింగరేణి కార్మికుడిగా విజయ్‌  కనపడుతున్నాడు. క్యాథరిన్‌ను విజయ్ స్మిత మేడమ్ అని సంబోధిస్తున్నాడు.

రాశీ ఖన్నా యామినిగా కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ జనవరి 3న విడుదల చేస్తున్నారు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయనున్నారు.
కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపి సుందర్, ఆర్ట్ : సాహి సురేష్.