2024 Fashion Calendar : 2024 ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్ లాంచ్ అయ్యింది. ప్రముఖ సెలెబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల ఒక అద్భుతమైన ఈవెంట్ ఏర్పాటు చేసి ఈ క్యాలెండర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినీతారలు పాల్గొని సందడి చేశారు. నవీన్ చంద్ర, వెంకట్, చైతన్య రావు, కృష్ణుడు, కామాక్షి భాస్కర్ల, ప్రణీత పట్నాయక్, అశ్విని, సౌమ్య, సాయి రోనక్.. ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అలాగే ఐ బౌటిక్ నిర్వహకులు డాక్టర్ జగదీష్ రెడ్డి బండి, డాక్టర్ ప్రణతి రెడ్డి బండి (సెలెబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఫ్యాషన్ క్యాలెండర్ ని సినీ తారలు చేతుల మీదుగా లాంచ్ చేశారు. క్యాలెండర్ లాంచ్ అనంతరం షరీఫ్ నంద్యాల మాట్లాడుతూ.. ఈ క్యాలెండర్ సూట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐ బౌటిక్ కొత్త కాన్సెప్ట్, గాగుల్స్ తో ఈ క్యాలెండర్ షూట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ క్యాలెండర్ కోసం సినీనటులతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. Also read : Guntur Kaaram : సుదర్శన్ థియేటర్ దగ్గర మహేష్ ఫ్యాన్స్ రచ్చ.. నమ్రత సైతం వీడియో షేర్.. [gallery columns="1" size="full" ids="768784,768783,768782,768776,768779,768778,768777,768775,768780,768781"] ;