Happy Birthday Chiranjeevi : బాస్ బర్త్‌డే.. ‘మెగా’ విషెస్..

చిరంజీవి జన్మదినం.. తెలుగు సినిమా పరిశ్రమకు పర్వదినం..

Happy Birthday Chiranjeevi

Happy Birthday Chiranjeevi: ‘పునాదిరాళ్ళు’ సినిమాతో నట జీవితానికి పునాది వేసుకుని, ‘ఖైదీ’ సినిమాతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో ‘ఖైదీ’ అయ్యి, ‘మెగాస్టార్‌’ గా, ‘మెగా’ మనసున్న మానవతా వాదిగా ఎదిగిన చిరంజీవి పుట్టినరోజు నేడు.

చిరు జన్మదినం.. తెలుగు సినిమా పరిశ్రమకు పర్వదినం.. ఆగస్టు 22 చిరు తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ వర్గాల వారు, మెగాభిమానులు సోషల్ మీడియా ద్వారా ‘మెగా’ విషెస్ తెలియజేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సునీల్‌తో పాటు పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు చిరుకి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ.. చిరు – మెహర్ రమేష్ కాంబోలో రానున్న ‘భోళా శంకర్’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.