ప్రధాని మోదీకి సెలబ్రిటీల శుభాకాంక్షలు..

  • Publish Date - September 17, 2020 / 12:33 PM IST

Celebrities Birthday Wishes to Modi: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

ప్రియమైన ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో సంవత్సరాలపాటు దేశానికి మీరు ఉన్నతమైన సేవలందించాలని కోరుకుంటున్నా- చిరంజీవి..


గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ ఘనమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వంలో మన భరతమాత శ్రీ అరబిందో కలలు కన్న తన నిజమైన స్ఫూర్తి శిఖరాలను తాకుతుందని ఆశిస్తున్నా-పవన్ కల్యాణ్..

ప్రధానమంత్రి మోదీగారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా -మోహన్ లాల్..


మన భారత దేశం బాగుపడాలంటే, దేశదేశాల్లో మన భారత దేశం గురించి చెప్పుకోవాలంటే, మోడీ గారే జీవితాంతము భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత బిడ్డ ప్రధాని మోడీ గారు వంద సంవత్సరములు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నాను-మోహన్ బాబు..

గౌరవ ప్రధానమంత్రి మోదీగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ స్ఫూర్తివంతమైన, దృఢమైన నాయకత్వం, దార్శనికత ఎంతో మార్పు తీసుకొచ్చింది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా-మహేష్ బాబు..


గౌరవ ప్రధానమంత్రి మోదీగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఫిట్‌నెస్ మీద మీరు చూపించే శ్రద్ధ నాకు ప్రతిరోజూ స్ఫూర్తి కలిగిస్తుంది. మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటున్నా- రకుల్ ప్రీత్..

వీరితోపాటు కమల్ హాసన్, బోని కపూర్ తదితరులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.