ప్రముఖ నిర్మాత లక్ష్మణ్ కుమారుడు ఉజ్వల్ నిశ్చితార్థం మనీషాతో హైదరాబాద్‌లో జరిగింది.. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు..
ప్రముఖ నిర్మాత లక్ష్మణ్ కుమారుడు ఉజ్వల్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లతో కలిసి లక్ష్మణ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఆయన కుమారుడు ఉజ్వల్ నిశ్చితార్థం మనీషాతో జరిగింది.
Read Also : జనవరి 9న సూపర్‌స్టార్ ‘దర్బార్’
ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ మహేష్ బాబు భార్య నమ్రత సందడి చేశారు. దర్శకులు వి.వి.వినాయక్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్‌లతో పాటు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Celebrities at the Engagement of #Ujwal S/O Producer #Lakshman (@SVC_official) held on Nov 17th at Hyderabad. pic.twitter.com/JJ8ngxIJux
— BARaju (@baraju_SuperHit) November 18, 2019