Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కలిసి నిలబడదామంటూ సినీ ప్ర‌ముఖుల పోస్ట్‌లు..

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

celebrities hails indian army operation sindoor

పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా భారత్‌ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్‌, పీవోకేల్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భార‌త సైన్యం ఈ మెరుపు దాడులు చేసింది. దీనిపై సినీ ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. జై హింద్‌, భార‌త్ మాతాకీ జై, ఆప‌రేష‌న్ సింధూ అంటూ హ్యాష్ ట్యాగ్‌ల‌తో సోష‌ల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

ఆప‌రేష‌న్ సిందూర్ విజ‌య‌వంత‌మైనందుకు ఆనందంగా ఉంద‌ని మెగాస్టార్ చిరంజీవి జైహింద్ అని ట్వీట్ చేశారు.

Samantha : అలాంటివి నేను ఎంకరేజ్ చేయను.. సమంత కామెంట్స్ వైరల్..