Samantha : అలాంటివి నేను ఎంకరేజ్ చేయను.. సమంత కామెంట్స్ వైరల్..
సమంత ఓ విషయం పై స్పందించింది.

Samantha Reacts on Her Temple and Fan Love
Samantha : సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హెల్త్ చూసుకుంటూ, బిజినెస్ లతో బిజీగా ఉంది. అయితే సమంత నిర్మాతగా శుభం అనే సినిమాతో మే 9న రానుంది. నేడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత మీడియాతో మాట్లాడింది. అయితే సమంత ఓ విషయం పై స్పందించింది.
ఓ మూడేళ్ళ క్రితం బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో తెనాలి సందీప్ అనే ఓ అభిమాని సమంతకు గుడి కట్టాడు. ఇటీవల సమంత పుట్టిన రోజు నాడు ఆ పాత విగ్రహాన్ని పక్కన పెట్టి సమంత కొత్త విగ్రహాన్ని ఆ గుడిలో పెట్టాడు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. నేడు మీడియా దీనిపై సమంతను మీకు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నించింది.
Also Read : Samantha : అతనే నా బిజినెస్ పార్టనర్.. బిజినెస్, సినిమా అన్నిట్లో.. సమంత కామెంట్స్ వైరల్.. ఎవరు ఇతను?
సమంత దీనికి సమాధానమిస్తూ.. ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా అని అనుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు అని అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్దతిని మాత్రం నేను ఎంకరేజ్ చేయను అని చెప్పింది.
Also See : Samantha : సమంత లేటెస్ట్ ఫొటోలు చూశారా..? సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో..