Samantha : అతనే నా బిజినెస్ పార్టనర్.. బిజినెస్, సినిమా అన్నిట్లో.. సమంత కామెంట్స్ వైరల్.. ఎవరు ఇతను?
నేడు సమంత మీడియాతో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

Samantha Tells about her Business Partner Himank Duvvuru
Samantha : సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు శుభం అనే సినిమాతో వస్తుంది. ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుండగా నేడు సమంత మీడియాతో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
ఈ క్రమంలో.. సమంత బిజినెస్ లు చేస్తుంది, పికెల్ బాల్ టీమ్ కొంది, ఇదంతా ఎలా ఉంది? ప్రాఫిట్స్ వస్తున్నాయా? ఎవరి సలహాలు అని పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి సమంత సమాధానమిచ్చింది.
Also Read : Samantha : ఆ విషయంలో నేనేం తప్పు చేస్తానో నాకు తెలుస్తుంది.. నాకు ఎవరూ చెప్పక్కర్లేదు..
సమంత.. గత కొన్నేళ్లుగా నాకు మేనేజర్ గా వ్యవహరిస్తున్న హిమాంక్ ఇప్పుడు నా బిజినెస్ లకు అన్నిటికి పార్ట్నర్. నేను హెల్త్ పర్సన్ అయితే, అతను స్పోర్ట్స్ పర్సన్. అందుకే పికిల్ బాల్ టీమ్ కొన్నాను. అతనికి ఈ ఆట మీద అవగాహన ఉంది. నాకు అతను చేసేది కరెక్ట్ అనిపించింది. మా ఇద్దరి పార్ట్నర్ షిప్ లోనే టీమ్ కొన్నాము. మేము ఎక్కువగానే పెట్టుబడి పెట్టాము. రెండు మూడేళ్ళలో ఇన్వెస్ట్ తిరిగి వస్తుంది. ప్రస్తుతం ఈ ఆట జనాల్లోకి ఫాస్ట్ గా వెళ్తుంది. నా బిజినెస్ అన్నిట్లో అతను సపోర్ట్ ఉన్నాడు. మేము ఇద్దరం కలిసే అన్ని చేస్తున్నాము. ఈ సినిమా డబ్బు లెక్కలు కూడా అంతా అతనే చూసుకున్నాడు అని తెలిపింది.
సమంత చెప్పిన వ్యక్తి హిమాంక్ దువ్వూరు. గతంలో సమంతకు మేనేజర్ గా చేసి సమంతకి క్లోజ్ అవ్వడంతో ఇప్పుడు సమంతతో కలిసి సినిమాలు, బిజినెస్ లు చేస్తున్నాడు అని తెలుస్తుంది. శుభం సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించాడు హిమాంక్.
Also Read : Samantha : చాన్నాళ్లకు సమంత హీరోయిన్ గా సినిమా.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్..