Samantha : చాన్నాళ్లకు సమంత హీరోయిన్ గా సినిమా.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్..

శుభం సినిమా ప్రమోషన్స్ లో నేడు మీడియాతో మాట్లాడింది సమంత.

Samantha : చాన్నాళ్లకు సమంత హీరోయిన్ గా సినిమా.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్..

Samantha Gives Clarity on Her Main Lead Movie and gives shooting update

Updated On : May 6, 2025 / 5:17 PM IST

Samantha : సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో 2023 లో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ థియేటర్స్ లో సమంత సినిమా రాలేదు. ఈ గ్యాప్ లో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఇప్పుడు నిర్మాతగా శుభం అనే సినిమాతో రాబోతుంది. శుభం సినిమా మే 9 రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో నేడు మీడియాతో మాట్లాడింది సమంత. ఈ క్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. హీరోయిన్ గా మళ్ళీ ఎపుడు సినిమా చేస్తున్నారు? మెయిన్ లీడ్ లో అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం సినిమా సంగతేంటి అని అడిగారు.

Also Read : Anil Ravipudi : సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వాళ్ళ అమ్మని చూశారా? టీవీ షోలో సందడి.. ప్రోమో వైరల్..

దీనికి సమంత సమాధానమిస్తూ.. నేను మెయిన్ లీడ్ గా ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా ఒక్కటే చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ నెక్స్ట్ మంత్ మొదలవుతుంది అని తెలిపింది. అలాగే అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో సమంత హీరోయిన్ అన్న రూమర్స్ అబద్దం అని క్లారిటీ ఇచ్చింది.

వచ్చే నెలలో సమంత షూట్ మొదలుపెడితే ఆ సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సమంత ఫ్యాన్స్ ఆమెని మెయిన్ లీడ్ లో థియేటర్లో చూడాలని ఎదురుచూస్తున్నారు. సో ఇంకా కొంచెం టైం పట్టొచ్చు. ఈ లోపు శుభం సినిమాలో సమంత గెస్ట్ పాత్రలో కనిపించనుంది.

 

Also Read : Jabardasth Tanmay : జబర్దస్త్ లో మేము ముగ్గురమే అమ్మాయిలుగా మారింది.. తన్మయి కామెంట్స్.. ఎవరెవరంటే..?