Samantha : ఆ విషయంలో నేనేం తప్పు చేస్తానో నాకు తెలుస్తుంది.. నాకు ఎవరూ చెప్పక్కర్లేదు..
నేడు ప్రమోషన్స్ లో భాగంగా సమంత మీడియాతో మాట్లాడింది.

Samantha Interesting Comments on Her Acting at Subham Movie Promotions
Samantha : కొన్నాళ్లుగా సినిమాలకు దూరమై హెల్త్ చూసుకుంటూ, బిజినెస్ లు డెవలప్ చేసుకుంటూ బిజీగా ఉంది సమంత. నిర్మాతగా సమంత శుభం అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా మే 9 రిలీజ్ కానుంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత బయటకు వస్తుంది. నేడు ప్రమోషన్స్ లో భాగంగా సమంతా మీడియాతో మాట్లాడింది.
Also Read : Samantha : చాన్నాళ్లకు సమంత హీరోయిన్ గా సినిమా.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్..
ఈ క్రమంలో తన యాక్టింగ్ కెరీర్ గురించి, యాక్టింగ్ లో ఇంకా ఏమైనా ఛేంజెస్ చేసుకోవాలా అని అడగ్గా సమంత సమాధానమిస్తూ.. సినిమాల్లో నేనేం తప్పు చేస్తానో నాకు తెలుస్తుంది. యాక్టింగ్ లో ఏం తప్పు చేసానో ఎవరూ చెప్పక్కర్లేదు. ఎడిటింగ్ లో, ఆ తర్వాత సినిమాని నేను చాలా సార్లు చూస్తాను. నేనే పెద్ద క్రిటిక్ ని. చాలా సార్లు నా సినిమా చూసి నా తప్పులు నేనే తెలుసుకుంటాను. ఆ తర్వాత సినిమాల్లో అవి మార్చుకుంటాను అని తెలిపింది.
Also Read : Anil Ravipudi : సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వాళ్ళ అమ్మని చూశారా? టీవీ షోలో సందడి.. ప్రోమో వైరల్..