వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుకలో సెలబ్రిటీల సందడి

ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది..

  • Publish Date - February 4, 2020 / 05:10 AM IST

ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది..

‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’, ‘చాలా బాగుంది’, ‘నా హృదయంలో నిదురించే చెలి’ వంటి పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రముఖ హీరో వడ్డే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘అటాక్’ సినిమాలో కనిపించాడు. సినిమాలు పక్కన పెట్టేసి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు. తాజాగా నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత, నటులు మురళీమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సునీల్, వేణు తొట్టెంపూడి, శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహా, రోజా, శివాజీ రాజా,  నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ అధినేతలైన వడ్డే సోదరులు కీర్తిశేషులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్‌ల దివ్యాశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వడ్డే సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.