Celebrity Cricket League 2024
Celebrity Cricket League 2024 : వెండితెరపైనే కాదు క్రికెట్ మైదానంలోనూ అలరించేందుకు సిద్ధం అయ్యారు ఎనిమిది భాషలకు చెందిన సినీ నటులు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 10వ సీజన్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. హిందీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం బాషలకు చెందిన ఎనిమిది జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. బెంగాల్ టైగర్స్‌కు జిషు సేన్ గుప్తా, చెన్నై రైనోస్ ఆర్య, కర్నాటక బుల్డోజర్స్‌కు ప్రదీప్, కేరళ స్ట్రైకర్స్ కు కుంచకో బోబన్, ముంబయి హీరోస్‌కు రితేష్ దేశ్‌ముఖ్, పంజాబ్ డీ షేర్స్ కు సోనూ సూద్, భోజ్‌పురి దబాంగ్స్ కు మనోజ్ తివారీ, తెలుగు వారియర్స్ కు అక్కినేని అఖిల్ లు నాయకత్వం వహిస్తున్నారు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనున్న ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 20 మ్యాచులు జరగనున్నాయి. కొన్ని మ్యాచులు షార్జాలో ఇంకొన్ని మ్యాచులు భారత్‌లో జరగనున్నాయి. మొదటి మ్యాచులో ముంబై హీరోస్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరగనుంది. షార్జా ఇందుకు వేదిక కానుంది.
షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 23న – ముంబై హీరోస్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ – రాత్రి 7 గంటలకు షార్జాలో
ఫిబ్రవరి 24న – భోజ్‌పురి దబాంగ్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ – మధ్యాహ్నాం 2:30 గంటలకు షార్జాలో
ఫిబ్రవరి 24న – కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ ముంబై హీరోస్ – రాత్రి 7 గంటలకు షార్జాలో
ఫిబ్రవరి 25న – పంజాబ్ డి షేర్ వర్సెస్ చెన్నై రైనోస్ – మధ్యాహ్నాం 2:30 గంటలకు షార్జాలో
ఫిబ్రవరి 29న – బెంగాల్ టైగర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ – రాత్రి 7 గంటలకు షార్జాలో
Ambajipeta Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ టీమ్ ఆ ఊరి కోసం ఏం చేస్తోందంటే?
ఫిబ్రవరి 29న – చెన్నై రైనోస్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్ – రాత్రి 7 గంటలకు బెంగళూరులో
మార్చి 1న – పంజాబ్ డి షేర్ వర్సెస్ తెలుగు వారియర్స్ – రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లో
మార్చి 2న – ముంబై హీరోస్ వర్సెస్ భోజ్‌పురి దబాంగ్స్ – మధ్యాహ్నాం 2:30 గంలకు బెంగళూరులో
మార్చి 2న – బెంగాల్ టైగర్స్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్ – రాత్రి 7 గంలకు బెంగళూరులో
మార్చి 2న – భోజ్‌పురి దబాంగ్స్ వర్సెస్ చెన్నై రైనోస్ – మధ్యాహ్నాం 2:30 గంటలకు హైదరాబాద్‌లో
మార్చి 3న – కేరళ స్ట్రైకర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ – రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లో
మార్చి 8న – పంజాబ్ డి షేర్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ – రాత్రి 7 గంటలకు చండీగఢ్‌లో
మార్చి 9న – కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ – మధ్యాహ్నాం 2:30 గంటలకు త్రివేండ్రంలో
మార్చి 9న – కేరళ స్ట్రైకర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ – రాత్రి 7 గంటలకు త్రివేండ్రంలో
మార్చి 10న – భోజ్‌పురి దబాంగ్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ – మధ్యాహ్నాం 2:30 గంటలకు చండీగఢ్‌లో
మార్చి 10న – ముంబై హీరోస్ వర్సెస్ పంజాబ్ డి షేర్ – రాత్రి 7 గంటలకు చండీగఢ్‌లో
మార్చి 15న – క్వాలిఫయర్ 1 – ర్యాంక్ 1 వర్సెస్ ర్యాంక్ 2 – మధ్యాహ్నాం 2:30 గంటలకు వైజాగ్‌లో
మార్చి 15న – ఎలిమినేటర్ – ర్యాంక్ 3 వర్సెస్ ర్యాంక్ 4 – రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో
మార్చి 16న – క్వాలిఫైయర్2- క్వాలిఫైయర్1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత – రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో
మార్చి 17న – క్వాలిఫైయర్ 1 విజేత వర్సెస్ క్వాలిఫయర్ 2 విజేత – రాత్రి గంటలకు వైజాగ్‌లో
Upasana : మా తాతయ్యకు అప్పుడు.. నా కూతురి తాతయ్యకు ఇప్పుడు.. అంటూ ఉపాసన ఆసక్తికర కామెంట్స్
ఈ మ్యాచులు హిందీలో జీ అన్మోల్ సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. జియో సినిమాలోనూ చూడొచ్చు.