Censor Board : మళ్ళీ ఇబ్బంది పెడుతున్న సెన్సార్ బోర్డు.. అల్లరి నరేష్ సినిమాకు ఎఫెక్ట్..

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కావాల్సి ఉంది. (Censor Board)

  • Published on- August 31, 2026 / 03:21 PM IST

Censor Board

Censor Board : గత కొంతకాలంగా సెన్సార్ బోర్డు సినిమాలను, నిర్మాతలను ఇబ్బంది పెడుతుంది. సినిమా సెన్సార్ చేయకుండా ఏవేవో కారణాలు చెప్పడం, A సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం, సెన్సార్ ని వాయిదా వేయడం చేస్తున్నారు. గత కొంతకాలంగా సెన్సార్ సర్టిఫికెట్ పై, సెన్సార్ మెంబర్స్ పై అనేకమంది తెలుగు నిర్మాతలు బహిరంగంగానే ప్రెస్ మీట్స్ లో విమర్శలు చేసారు. విశాల్ లాంటి హీరో అయితే సెన్సార్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసారని కూడా ట్వీట్ చేసారు. విశాల్ చెప్పినట్టు కొంతమంది సెన్సార్ సభ్యులు సినిమా సెన్సార్ అవ్వాలంటే డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ సమాచారం. ఇలా సెన్సార్ పై ఇటీవల అనేక విమర్శలు తలెత్తుతున్నాయి.

ఇటీవల తెలుగులోనే దీవానా, కపుల్ ఫ్రెండ్లీ, హే బలవంత్, వనవీర.. ఇలా అనేక సినిమాలను సెన్సార్ బోర్డు ఇబ్బంది పెట్టింది. వీరంతా మీడియా ముందు సెన్సార్ పై విమర్శలు చేసారు. తాజాగా అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమాకు సెన్సార్ బోర్డు ఇబ్బంది కలిగిస్తుంది.

Also See : Ananthika Sanilkumar : రెడ్ డ్రెస్‌లో అనంతిక క్యూట్ ఫోటోలు..

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలాయాపన చేస్తున్నారు సెన్సార్ సభ్యులు. రంభ, ఊర్వశి, మేనక పాత్రలను మరీ అందంగా చూపించారని, గ్లామర్ పాత్రల్లా చూపించారని సెన్సార్ సభ్యులు అంటున్నారని సమాచారం. గతంలో ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో కూడా రంభ ఊర్వశి మేనక పాత్రలను అర్ధనగ్నంగానే చూపించి వారితో డ్యాన్సులు కూడా వేయించారు. గతంలో అనేక సినిమాల్లో రంభ ఊర్వశి మేనక పాత్రలను ఒకేలా చూపించారు. ఇప్పుడు కూడా అలాంటి డ్రెస్సుల్లోనే చూపించారు. కానీ సెన్సార్ బోర్డు ఇప్పుడు అభ్యంతరం చెప్తుంది.

దీంతో రిలీజ్ టైం కి ఈ సెన్సార్ ఇబ్బంది ఏంటని తలలు పట్టుకున్నారు రంభ ఊర్వశి మేనక నిర్మాతలు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎక్కడా దీనిపై విమర్శలు కూడా రాలేదు. ఆడియన్స్ కూడా ఈ కామెడీ సినిమాని చూడటానికి ఎదురు చూస్తున్నారు. కానీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇంకా ఇవ్వకపోవడంతో సినిమా ప్రస్తుతానికి వాయిదా పడనుందని సమాచారం.

Also See : Sundeep Kishan : పెంపుడు కుక్క‌ను ప‌రిచ‌యం చేసిన సందీప్ కిష‌న్.. ఎంత క్యూట్‌గా ఉందో..