×
Ad

Purushaha : పురుష: మూవీ నుంచి ‘చాటు చాటు’ లిరికల్ సాంగ్ విడుద‌ల‌

పురుష: (Purushaha) మూవీ నుంచి చాటు చాటు అనే లిరికల్ పాట‌ను విడుద‌ల చేశారు.

Chaatu Chaatu Lyrical song out from Purushaha movie

Purushaha : వీరు వులవల దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పురుష:’. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్నిబత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి.

Pawan Kalyan : రాజమౌళి నెక్స్ట్ మూవీ పవన్ కల్యాణ్‌తో..?

తాజాగా ఈ చిత్రం నుంచి చాటు చాటు అనే లిరికల్ పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా చిన్మయి శ్రీపాద పాడింది. శ్రవణ్ భరద్వాజ్ బాణీలు కట్టారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూరైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర విడుద‌ల తేదీని వెల్ల‌డించ‌నున్న‌ట్లు మూవీ యూనిట్ తెలిపింది.