Chadalavada Srinivas Rao happy about Record Break Movie review
Record Break : చదలవాడ శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన స్పోర్ట్స్ డ్రామా ఫిలిమ్ ‘రికార్డ్ బ్రేక్’. బాక్సింగ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో జయసుధ తనయుడు నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రం.. నేడు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు కొంచెం ముందుగానే పడ్డాయి. ఈ ప్రీమియర్ షోకి దర్శకుడు విజయేంద్రప్రసాద్, జయసుధ, ఆర్ నారాయణ మూర్తి, రైటర్ చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్, సునీల్ రెడ్డి వంటి ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా ఈ సినిమా చూసి.. మంచి సినిమా అని మెచ్చుకోవడం, తల్లి సెంటిమెంట్, దేశభక్తి గురించి చాలా బాగా చూపించారని చెప్పడం తనకి ఏంటో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
Also read : Gaami Twitter Review : విశ్వక్ సేన్ ‘గామి’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?
ఈ మూవీలో నటించిన తన కొడుకు నిహార్ గురించి జయసుధ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నిహార్ నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు చేశాడని కాకుండా చెప్తున్నా ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి. అందరూ కచ్చితంగా చూడాలి” అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ఈ సినిమాకి అంగిరెడ్డి శ్రీనివాస్ కథని అందించగా కంతేటి శంకర్ డిఓపిగా, సాబు వర్గీస్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.