విశ్వక్ సేన్ ‘గామి’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

ట్రైలర్ అండ్ టీజర్ తో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ 'గామి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. పబ్లిక్ టాక్ ఏంటి..?

విశ్వక్ సేన్ ‘గామి’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

Vishwak Sen Gaami movie Twitter Review and public talk

Gaami Twitter Review : టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఆరేళ్ళ పాటు కష్టపడి చేసిన సినిమా ‘గామి’. విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కార్తీక్ శబరీష్ నిర్మించగా యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది. ట్రైలర్ అండ్ టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయ్యింది. మరి థియేటర్స్ లో ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంది.

Also read : Premalu Review : ‘ప్రేమలు’ మూవీ రివ్యూ.. సింగిల్ బాయ్స్ కచ్చితంగా చూడాల్సిందే..

మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా.. స్టోరీ చాలా కొత్తగా, ఇంటరెస్టింగా ఉంది అని చెబుతున్నారు. ఇక ట్రైలర్ లో చూపించిన విధంగానే VFX అదిరిపోయాయి అంట. బీజీఎమ్ కూడా టాప్ నాచ్. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రమే కొంచెం స్లోగా ఉందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ బాగుందట. విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందట.

ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, VFX, బీజీఎమ్, విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్, సింహం యాక్షన్ సీక్వెన్స్ పాజిటివ్ పాయింట్స్ గా చెబుతున్నారు. ఎమోషనల్ హై ఇచ్చే సీన్స్ లేకపోవడం, పాత్రల చిత్రీకరణ నెగటివ్ పాయింట్స్. మొత్తం మీద సినిమా ఓకే అనిపిస్తుందని చెబుతున్నారు.

మూడు స్టోరీస్ ని చూపిస్తూ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారని, సెకండ్ హాఫ్ లో వచ్చే పెద్ద ట్విస్ట్, అలాగే ఫస్ట్ హాఫ్ లో వదిలిన ప్రశ్నలకు బదులిస్తూ వచ్చే సమాధానాలు ఇంటరెస్టింగ్ గా ఉంటాయట.

సినిమాటోగ్రఫీ, VFX, బీజీఎమ్ తో ఆకట్టుకున్న ఈ మూవీకి 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు అని చెబుతున్నారు.