Chaitanya Rao Hebah Patel Honeymoon Express Song Released by Vijayendra Prasad
Honeymoon Express Song : 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్యరావు(Chaitanya Rao) హీరోగా, హెబా పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా హనీమూన్ ఎక్స్‌ప్రెస్. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా బాల రాజశేఖరుని దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ని ఇటీవల ఆర్జీవీ రిలీజ్ చేయగా ఇప్పుడు ఒక మెలోడీ పాటని రిలీజ్ చేసారు. రాజమోళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా నుంచి సాంగ్ ని ‘ప్రేమ నువ్వా కాదా.. పోల్చే దారే లేదా.. అంటూ సాగే పాటని నిన్న రిలీజ్ చేశారు.
Also Read : Jeethu Jospeh : ప్రేమ కోసం సినిమాలని వదిలేసిన వ్యక్తి.. ఇప్పుడు మలయాళం స్టార్ డైరెక్టర్..
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటని నిన్న విడుదల చేయడం విశేషం. ఈ పాటని అనురాగ్ కులకర్ణి పాడాడు. ప్రస్తుతం ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.