×
Ad

Chalaki Chanti : జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్‌‌కి వెళ్ళొద్దన్నారు.. మూడు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌కి నో చెప్పాను.. డబ్బులకోసమే బిగ్‌బాస్‌కి..

చలాకి చంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను జబర్దస్త్‌ లో ఎప్పట్నుంచో ఉన్నాను. నాకు గతంలో కూడా బిగ్‌బాస్‌ ఆఫర్ వచ్చింది, మల్లెమాల నిర్మాణ సంస్థకి చెప్తే వాళ్ళు నో అన్నారని............

  • Published On : September 8, 2022 / 08:13 AM IST

Chalaki Chanti says that he is going to Bigg Boss only for money

 

Chalaki Chanti :  బిగ్‌బాస్‌ షోకి చాలా మంది స్టార్లు డబ్బుల కోసం, ఫేమ్ కోసం వెళ్తుంటారు. కొంతమంది స్టార్లు అక్కడ జరిగే గొడవలు, రచ్చ చూసి అస్సలు వెళ్ళమంటారు. అందుకే కొంతమంది బిగ్‌బాస్‌ కి వెళ్ళడానికి ఆసక్తి చూపితే, మరికొంతమంది బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్ వచ్చినా నో చెప్తారు. ఈ సారి కంటెస్టెంట్స్ లో జబర్దస్త్ నుంచి వెళ్లినవారిలో చలాకి చంటి ఉన్నాడు.

సాధారణంగా జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్‌ కి వెళ్లిన వాళ్ళని మళ్ళీ అటు రానివ్వరు. ఆ రెండు వేర్వేరు సంస్థలు కావడంతో మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలవరు. ఇలా జబర్దస్త్ నుంచి కొంతమంది దూరమయ్యారు. తాజాగా చలాకి చంటి బిగ్‌బాస్‌ కి వెళ్లేముందు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు రిలీజ్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో చంటి పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. తనకి ఇప్పటికే మూడు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్ వచ్చింది కానీ నో చెప్పానని, ఇప్పుడు నాలుగో సారి ఆఫర్ వస్తే వెళ్తున్నానని చెప్పాడు. నో చెప్పడానికి కూడా కారణాలు చెప్పాడు.

Sharwanand : మా అమ్మ బంగారం అమ్మి సినిమా తీసి అప్పులపాలయ్యాను.. మూడు నెలలు బయటకి రాలేదు..

చలాకి చంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నేను జబర్దస్త్‌ లో ఎప్పట్నుంచో ఉన్నాను. నాకు గతంలో కూడా బిగ్‌బాస్‌ ఆఫర్ వచ్చింది, మల్లెమాల నిర్మాణ సంస్థకి చెప్తే వాళ్ళు నో అన్నారని ఆగిపోయాను. ఈ సారి కూడా బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్ రాగానే మల్లెమాల టీమ్‌కు చెప్పాను, వాళ్ళు మళ్ళీ నో చెప్పారు. జబర్దస్త్ లో సీనియర్‌వి, ఎందుకు వెళ్లడం, కావాలంటే ఇంకో షో నీతో ప్లాన్ చేద్దాం అన్నారు. కానీ నాకు డబ్బులు కావాలి, కొన్ని బాధ్యతలున్నాయి, డబ్బులకోసమే వెళ్తున్నా, కావాలంటే బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక మళ్ళీ తిరిగొస్తాను, మళ్ళీ జబర్దస్త్ చేస్తాను అని చెప్పి వెళ్తున్నాను” అని తెలిపాడు. దీంతో చంటి చేసే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.