Sharwanand : మా అమ్మ బంగారం అమ్మి సినిమా తీసి అప్పులపాలయ్యాను.. మూడు నెలలు బయటకి రాలేదు..

శర్వానంద్ మాట్లాడుతూ.. ''పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ అది ఫ్లాప్ అయినప్పుడు షాక్‌లోకి వెళ్ళాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదు. నా మొహం ఎవరికి

Sharwanand : మా అమ్మ బంగారం అమ్మి సినిమా తీసి అప్పులపాలయ్యాను.. మూడు నెలలు బయటకి రాలేదు..

Sharwanand says his bad past and movie failures

Sharwanand :  శర్వానంద్, రీతూ వర్మ జంటగా అమల ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఒకేఒక జీవితం. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్ లో తెరకెక్కింది. సెప్టెంబర్ 9న ఒకేఒక జీవితం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ తన గతంలో జరిగిన బ్యాడ్ సంఘటనలని షేర్ చేసుకున్నాడు. తన ఫెయిల్యూర్స్ పై మాట్లాడాడు. గతంలో శర్వానంద్ కో అంటే కోటి అనే ఒక సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డబ్బులు పోగొట్టుకున్నాడు. వీటిపై తాజాగా శర్వానంద్ మాట్లాడాడు.

శర్వానంద్ మాట్లాడుతూ.. ”పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ అది ఫ్లాప్ అయినప్పుడు షాక్‌లోకి వెళ్ళాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదు. నా మొహం ఎవరికి చూపించలేకపోయాను. అంతకుముందు మా అమ్మ బంగారం అమ్మి మరీ కో అంటే కోటి సినిమాని నిర్మాతగా తీశాను. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డబ్బులు పోయాయి, రిలేషన్స్‌ కూడా దూరమయ్యాయి. అప్పుడు చాలా బాధపడ్డాను. దానివల్ల అయిన అప్పులు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. అన్ని సంవత్సరాల పాటు నాకు సొంతంగా ఒక్క షర్ట్‌ కూడా కొనుక్కోలేదు.”

BiggBoss 6 First Week Nominations : బిగ్‌బాస్‌ నామినేషన్స్ మొదలు.. మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..

”రన్‌రాజారన్‌ సినిమా హిట్ అయినప్పుడు ప్రభాస్‌ అన్న పిలిచి ఇంట్లో పార్టీ ఇచ్చాడు. నాకు ఇదంతా నిజమేనా, నేను హిట్ కొట్టానా అనే డౌట్ లో ఉన్నాను. ఎక్స్‌ప్రెస్‌ రాజా హిట్ అయినప్పుడు కూడా ప్రభాస్ అన్న పార్టీకి పిలిచాడు. కానీ సోమవారం దాకా కూడా హిట్ టాక్ వినిపిస్తే అప్పుడు పార్టీ చేసుకుందాం అన్నాను” అని తెలిపాడు.