Chandoo Mondeti: 300 ఏళ్ల నాటి చరిత్ర.. ఉజ్జయినీ బ్యాక్ డ్రాప్.. బాలీవుడ్ హీరోతో టాలీవుడ్ డైరెక్టర్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, రానా కాంబోలో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుడు చందు మొండేటి(Chandoo Mondeti).

Chandoo Mondeti making a historical film with Akshay Kumar in Ujjain backdrop

  • బడ్జెట్ కారణాల వల్ల ‘వాయుపుత్ర’ వెనక్కి
  • ఉజ్జయినీ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ మూవీ
  • అక్షయ్ కుమార్, రానాలతో చందు మొండేటి భారీ మూవీ

Chandoo Mondeti: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత నాగ చైతన్యతో ‘తండేల్’ తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సక్సెస్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అందుకే, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదట మైథాలజీ యానిమేషన్ చిత్రం ‘వాయుపుత్ర’ చేయాలని అనుకున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, బడ్జెట్ అంచనాలు దాటిపోవడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి హోల్డ్ పడింది. దీంతో చందు మొండేటి (Chandoo Mondeti)తన వద్ద ఎప్పటి నుంచో ఉన్న ఒక భారీ హిస్టారికల్ థ్రిల్లర్ కథను తెరపైకి తెచ్చారు.

Varanasi: గ్లోబల్ స్టేజ్‌పై ‘వారణాసి’.. మెక్సికో ఫస్ట్ లో ‘వారణాసి టు ద వరల్డ్’.. స్పెషల్ గ్లింప్స్‌ తో భారీ హైప్

దాదాపు 300 ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యంతో, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిలను ఎంపిక చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్‌కు ఈ హిస్టారికల్ సబ్జెక్ట్ పునర్వైభవాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. అలాగే రానా తన విలక్షణ నటనతో ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని సమాచారం.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. చందు మొండేటి మార్క్ మైథాలజీ ఎలిమెంట్స్, హిస్టారికల్ థ్రిల్లర్ కాంబినేషన్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. గతంలో ఈ కథను సూర్యకు వినిపించినప్పటికీ, కాల్షీట్ల సమస్య వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ల కలయికలో కరణ్ జోహార్ వంటి అగ్ర నిర్మాత అండతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.