Chandreshwara : జూన్ 27న ‘చంద్రేశ్వర’ విడుదల
సురేష్ రవి, ఆశా వెంకటేష్ జంటగా నటిస్తున్న చిత్రం చంద్రేశ్వర.

Chandreshwara movie release On June27th
సురేష్ రవి, ఆశా వెంకటేష్ జంటగా నటిస్తున్న చిత్రం చంద్రేశ్వర. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. జీవీ పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో డాక్టర్ రవీంద్ర చారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కియాలజీ కాన్సెప్ట్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్ అన్నింటికి కూడా మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు చంద్రేశ్వర మూవీతో తాను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నానని చెప్పారు. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదన్నారు. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెప్పగలం అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం ప్రధాన హైలెట్‌గా ఉంటుందన్నారు. ‘ఈశ్వరా.. నా పరమేశ్వరా’, ‘అఖిల అఖిల’ డ్యూయెట్ సాంగ్, ‘నమస్తే చిదంబరం’ అనే సాంగ్.. ఇలా సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయన్నారు. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయన్నారు. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామన్నారు. ఒకే రోజు విడుదల అవుతున్న ‘కన్నప్ప’, ‘చంద్రేశ్వర’ రెండు చిత్రాలు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.