Hombale Films : హోంబలే ఫిల్మ్స్ ఒకేసారి 7 సినిమాల ప్రకటన.. 2037 వరకు.. కల్కి 1, కల్కి 2 కూడా.. ఫుల్ లిస్ట్ ఇదే..
వరుస సినిమాలతో అలరించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సిద్ధమైంది

Hombale Films Mahavatar Cinematic Universe 7 films
వరుస సినిమాలతో అలరించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సిద్ధమైంది. కేజీయఫ్, కాంతార, సలార్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఈ నిర్మాణ సంస్థ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఏడు చిత్రాలను అందించనున్నట్లు తెలిపింది.
ఈ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఏడు చిత్రాల పేర్లతో పాటు వాటి విడుదల చేసే తేదీల వివరాలను వెల్లడించింది. రెండేళ్లకు ఒకటి చొప్పున ఈ చిత్రాలు రానున్నాయి. విష్ణుమూర్తి పది అవతారాలపై చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లు ఎంతో సంతోషంగా ఉందని నిర్మాణ సంస్థ తెలిపింది.
Salman Khan : కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ కొన్న సల్మాన్ ఖాన్.. కార్ విలువ ఎన్ని కోట్లు తెలుసా?
ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి చిత్రం ‘మహావతార్:నరసింహా’. ఈ చిత్రాన్ని త్రీడీలో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న చిత్రాలు ఇవే..
మహావతార్: నరసింహ (25 జూలై 2025)
మహావతార్ : పరశురామ్ (2027)
మహావతార్ : రఘునందన్ (2029)
మహావతార్ : ద్వారకాదీశ్ (2031)
మహావతార్ : గోకులానంద్ (2033)
మహావతార్ : కల్కి 1 (2035)
మహావతార్ : కల్కి 2 (2037)