CPI: తెలంగాణలో కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా సీపీఐ.. మళ్లీ కూనంనేనికే పార్టీ పగ్గాలు?

ప్రజాపోరాటాల్లో సీపీఐ వెనుకబడిందన్న చర్చ కూడా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న సీపీఐ..ప్రభుత్వ వైఫల్యాలపై గతంలోలాగా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయ్.

CPI: తెలంగాణలో కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా సీపీఐ.. మళ్లీ కూనంనేనికే పార్టీ పగ్గాలు?

Koonamneni Sambasivarao

Updated On : August 20, 2025 / 10:03 PM IST

CPI: కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు అంటేనే..ఆ పార్టీకి సారధి ఎవరు అవుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు సీపీఐ మహాసభలు నడుస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్‌లో మూడ్రోజుల పాటు పార్టీ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటారు. అయితే ముందు నుంచి తెలంగాణ వాదంపై ఒకటే స్టాండ్ మీదున్న సీపీఐ తెలంగాణలో ఉనికి పాట్లు పడాల్సి పరిస్ధితి పడుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్పుడు కొంత బలంగా ఉన్నా..ఆ తర్వాత క్రమక్రమంగా బలం తగ్గుతూ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చట్టసభల్లో చోటు దక్కించుకుని, తిరిగి మరోసారి పూర్వవైభవం దిశగా ప్రయత్నిస్తోంది.

Also Read: Srikakulam: మరోసారి ఇంట్రెస్టింగ్‌గా మారిన సిక్కోలు రాజకీయాలు.. ఎమ్మెల్యే కూన రవి.. సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్

అయితే గడిచిన మూడేళ్ల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావు సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు పార్టీ పగ్గాలు చెప్పడడం..ఆ తర్వాత ఏడాదికే ఎన్నికలు రావడం..కాంగ్రెస్ట్ పార్టీతో పొత్తు..ఆపార్టీలో నూతనోత్సం నింపిందన్న చర్చ ఉంది.

ఎన్నికల పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకే చెప్పింది. పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే సీటు కొత్తగూడెంలో కూనంనేని గెలిచారు. ఇక పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీని దక్కించుకుంది. అయితే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడే పొత్తు కుదరడంతో పాటు..తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన పదేళ్ల తర్వాత కమ్యూనిస్టు పార్టీల పక్షాన చట్టసభల్లో అడుగుపెట్టడం ఆ పార్టీకి మరింతగా కలిసివచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రజాపోరాటాల్లో సీపీఐ వెనుకబడిందా?

అయితే ప్రజాపోరాటాల్లో సీపీఐ వెనుకబడిందన్న చర్చ కూడా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న సీపీఐ..ప్రభుత్వ వైఫల్యాలపై గతంలోలాగా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయ్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి కూనంనేని సాంబశివరావుకే రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇవ్వనున్నారట.

ఇప్పటికే ఆయన ఓవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు పార్టీ కార్యదర్శిగా బాగా పనిచేశారన్న ఫీలింగ్ క్యాడర్‌లో ఉందంటున్నారు. (CPI)

అయితే చట్టసభల్లో సీటు ఆశించి భంగపడిన నేతలు..మరికొందరు మాత్రం పార్టీలో రెండు సామాజిక వర్గాల పెత్తనం ఇంకెన్నాల్‌లు అంటూ పెదవి విరుస్తున్నారట. మిగిలిన వారికి అవకాశం ఇవ్వారా అంటూ గుర్రుగా ఉన్నారనే చర్చ సాగుతోంది. అయితే రాబోయే ఎన్నికల్లో..కాంగ్రెస్‌ పొత్తు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కార్యదర్శి ఎంపిక ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. చివరికి ప్రస్తుతం ఉన్నవారికే పార్టీ పగ్గాలు అప్పగించి..పాత సంస్క్నతినే కొనసాగిస్తారా.? లేక కూనంనేనికే అవకాశం ఇస్తారా.? అనేది వేచి చూడాలి.