చెలియా అడుగుదామా.. చలినే కాస్త పెరగమని.. వీడియో సాంగ్ రిలీజ్.
కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్స్‌గా, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో, ఎస్.లక్ష్మణ్ కుమార్ తమిళ్‌లో నిర్మిస్తున్న సినిమా, దేవ్. ఈ సినిమాని తెలుగులో ఠాగూర్ మధు రిలీజ్ చెయ్యబోతున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన దేవ్ టీజర్, సాంగ్స్ అండ్ థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ మూవీలోని, చెలియా అడుగుదామా.. చలినే కాస్త పెరగమని.. అంటూసాగే వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. కార్తీ, రకుల్ కార్‌లో వెళ్తూ, ఒకరినొకరు కిస్ చేసుకోవడానికి దగ్గరగా జరుగుతుండగా రకుల్ ఫోన్ రింగ్ అవుతుంది. దీంతో కార్తీ చిరాకు పడడంతో సాంగ్ స్టార్ట్ అవుతుంది.
ఖాకీ తర్వాత కార్తీ, రకుల్ ఇద్దరి కెమిస్ట్రీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, ఆర్. వేల్ రాజ్ విజువల్స్, హారిస్ జైరాజ్ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, శోభి, దినేష్ కొరియోగ్రఫీ సాంగ్‌కి పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాయి. హరిహరన్, భరత్ సుందర్, క్రిష్, అర్జున్ చండి, శరణ్య గోపినాథ్ కలిసి పాడారు. ఆంధ్రా, తెలంగాణాలో దాదాపు.. రూ.5.5 కోట్ల నుండి, రూ.6 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. తమిళనాట దేవ్ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ని సన్ టీవీ సొంతం చేసుకుంది.
రీసెంట్‌గా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ టీమ్ దేవ్‌కి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఫిబ్రవరి 9న ప్రీ – రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఫిబ్రవరి 14న తమిళ్, తెలుగులో దేవ్ రిలీజ్ కానుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, విఘ్నేష్, అమృత, కార్తీక్ ముత్తురామన్, నిక్కీ గల్రానీ, రేణుక, వంశీకృష్ణ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేసారు.
వాచ్ చెలియా వీడియో సాంగ్…