Chennai court delivers final verdict on release of Jana Nayagan movie
Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, మమిత బైజు కీ రోల్స్ చేశారు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈరోజు(జనవరి 20) జన నాయగన్ సినిమా విడుదలపై తుది తీర్పు వెలువడనుంది. సుదీర్ఘ విచారణ తరువాత ఈ రోజు చెన్నై కోర్టు తీర్పు వెలువరించనుంది.
Allari Naresh: అల్లరి నరేష్ ఇంట విషాదం
ఈ తీర్పు పైనే జన నాయగన్(Jana Nayagan) సినిమా విడుదల ఆధారపడి ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఈ నేపధ్యంలోనే విజయ్ ఫ్యాన్స్ ఎలాంటి తీర్పు రానుంది అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ ప్రవేశం తరువాత విజయ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే అలాగే విజయ్ కెరీర్ లో ఇదే చివరి సినిమా కూడా. అందుకే జన నాయగన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.