Mega 158: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే యాక్షన్.. ఫస్ట్ లుక్ కూడా సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి- బాబీ మెగా 158(Mega 158) సినిమా నుంచి క్రేజీ అప్డేట్.

Chiranjeevi and bobby movie regular shooting starts from april

  • మెగాస్టార్- బాబీ కాంబోలో మూవీ
  • ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • ఫస్ట్ లుక్ తోనే మొదలుపెట్టనున్న టీమ్

Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి బరిలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న ఆయన, ఏమాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. తనకి ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర)తో చిరంజీవి మరో చేస్తుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.

Radhika Sarathkumar: అల్లు అర్జున్ డాన్స్‌ గురువు నేనే.. ఐకాన్ స్టార్‌పై రాధికా షాకింగ్ కామెంట్స్

వచ్చే నెల 20(ఏప్రిల్ 20)వ తేదీ నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్(Mega 158) షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో వినోదం, మాస్ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన బాబీ, ఈసారి మెగాస్టార్ కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారట. పూర్తిస్థాయి యాక్షన్ ప్రధానంగా సాగే ఈ కథలో చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు మేకర్స్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి, చిరంజీవికి కూతురుగా అనశ్వరా రాజన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. కానీ, ఆ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి ‘వాల్తేరు వీరయ్య’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో, అటు అభిమానుల్లోనూ, ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.