Puneeth Rajkumar : శివన్నను ఓదార్చిన చిరంజీవి – వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, ఆలీ తదితరులు పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు..
- sekhar
- Published On : October 30, 2021 / 05:12 PM IST
Chiranjeevi Venkatesh
Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు పునీత్ రాజ్ కుమార్ మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ షాక్కి గురైంది. పునీత్ సన్నిహితులు, అభిమానులు ఈ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..
ఆదివారం (అక్టోబర్ 31) కంఠీరవ స్టూడియోలో రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి. పునీత్‌ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు.
Kannada Power Star : పునీత్ రాజ్ కుమర్ హాఠాన్మరణం, గుండెపోటుతో అభిమాని మృతి
టాలీవుడ్ నుండి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి నిర్మాత సాయి కొర్రపాటి, ప్రభుదేవా, యాక్షన్ కింగ్ అర్జున్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సీనియర్ నరేష్, శివ బాలాజీ బెంగుళూరు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Puneeth Rajkumar: బెంగళూరు చేరిన పునీత్ పెద్ద కుమార్తె ధృతి.. కంఠీరవ స్టేడియంలో తీవ్ర భావోద్వేగం!
శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, ఆలీ తదితరులు బెంగుళూరు చేరుకున్నారు. పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. శివన్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్ కుమార్ అమెరికా నుండి బెంగుళూరు చేరుకున్నారు.
