Chiranjeevi : ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం.. చరణ్ పై చిరు ఎమోషనల్ ట్వీట్!

రామ్ చరణ్ అమెరికన్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇండియన్ నుంచి ఈ షోకి ఆహ్వానం అందుకున్న మొదటి సెలెబ్రెటీ రామ్ చరణ్. దీంతో చిరంజీవి..

Chiranjeevi emotional tweet on ram charan attending good morning america show

Chiranjeevi : చిరంజీవి, ఈ పేరు వింటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఒకటే.. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రయాణం. రాజకీయం వలన కొన్నాళ్ళు పరిశ్రమకు దూరంగా ఉన్న కాలంలో కూడా చిరు స్థానాన్ని మరొకరు అందుకోలేక పోయారు అంటే చిరంజీవి ఎంతటి స్థాయికి ఎదిగాడో అర్ధమవుతుంది. ఇక చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు. అందరి మదిలో ఒకటే ఆలోచన చిరంజీవి స్థాయిని అందుకోగలడా? అయితే చరణ్ ఆ స్థాయిని అందుకున్నాడా? అనే ప్రశ్న పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా ఏ ఇండియన్ యాక్టర్ కి దక్కని ఫేమ్ ని సొంతం చేసుకుంటున్నాడు.

Ram Charan : ఉపాసనకు డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తా.. టాక్ షోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్..

రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. హాలీవుడ్ ఆడియన్స్ నుంచి మూవీ టెక్నీషియన్స్ వరకు చరణ్ నటనకి ఫిదా అయిపోతున్నారు. దీంతో అమెరికన్ మీడియా రామ్ చరణ్ పై అనేక ఆర్టికల్స్ రాసుకొస్తున్నారు. తాజాగా యూఎస్ లో అత్యధికలు వీక్షించే పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్ళాడు. ఇండియన్ నుంచి ఈ షోకి ఆహ్వానం అందుకున్న మొదటి సెలెబ్రెటీ రామ్ చరణ్. దీంతో చరణ్ అభిమానులతో పాటు కుటుంబసభ్యులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిన్న ఉపాసన చిన్నమ్మ సంగీతారెడ్డి.. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అల్లుడు’ అంటూ ట్వీట్ చేసింది. తాజాగా చిరంజీవి కూడా తన పుత్రోత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇండియా తరుపు నుంచి రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం ఇది. ఇటువంటి అవకాశాన్ని తీసుకువచ్చిన మాస్టర్ మైండ్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.