Vishwambhara : రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. ‘విశ్వంభర’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన మెగాస్టార్

మెగాస్టార్ ఎంట్రీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా. అందుకనే 'విశ్వంభర' సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తూనే.. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Chiranjeevi entered into Vishwambhara sets and announced release date

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమా ‘విశ్వంభర’ని పట్టాలు ఎక్కించేసిన విషయం తెలిసిందే. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్.. చిరంజీవి లేకుండానే ఇటీవల మొదలయింది. మారేడుమిల్లి అడవుల్లో మొదటి షెడ్యూల్ ని షూట్ చేశారు. అయితే మెగా అభిమానులంతా.. ఈ మూవీ సెట్స్ లోకి చిరంజీవి ఎప్పుడు అడుగు పెడతారా అని ఎదురు చూస్తున్నారు.

అయితే మెగాస్టార్ ఎంట్రీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా. అందుకనే ఎంట్రీ ఇస్తూనే మూవీ రిలీజ్ డేట్ ని ఏడాది ముందే అనౌన్స్ చేసేశారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘అంజి’ కూడా సంక్రాంతి కనుక గానే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు విశ్వంభర కూడా సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే తెరకెక్కబోతుంది.

Also read : HanuMan : హనుమంతుడు వచ్చే సీన్‌ని.. అయోధ్య రామ మందిరం దగ్గర చేయాల్సి ఉంది.. కానీ..

పంచభూతాలు నేపథ్యంతో మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ గ్లింప్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. టైటిల్ గ్లింప్స్ తోనే మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమాలో మొత్తం విశ్వాన్ని చూపించేందుకు.. దాదాపు 13 సెట్స్ ని నిర్మించారట. మూవీలో 70 శాతం VFX పైనే డిజైన్ అయ్యి ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఈక్రమంలోనే ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తో కలిసి.. యాక్షన్ పార్ట్ డిజైన్ క్లాస్ లు కూడా నిర్వహించారు. ఇక అంజి సినిమాలో తన సినిమాటోగ్రఫీతో మెస్మరైజ్ చేసిన చోట కె నాయుడు.. ఈ చిత్రానికి కూడా కెమెరా మెన్‌గా చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు