Chiranjeevi : మొన్న పెళ్లిలో ఆనందంగా.. ఇవాళ మ‌ర‌ణం.. భాగ్య‌రాజ్ మృతిపై చిరంజీవి ఎమోష‌న‌ల్ ట్వీట్‌

భాగ్య‌రాజ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Chiranjeevi expresses his deep shock Over Bhagyarajs Demise

Chiranjeevi : ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె.భాగ్యరాజ్ గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశారు.

ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మొన్న గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో మేమంతా కలిసి నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు దిగుతూ ఎంతో ఆనందంగా గడిపాం. భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అలాంటి ఆయన ఈ ఉదయం ఇక లేరనే వార్త వినడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అద్భుతమైన దర్శకుడు, అసాధారణమైన స్క్రీన్‌ప్లే రచయిత, గొప్ప నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ గారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

*Divija Prabhakar : చంద‌మామ లాంటి అందం.. ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ఫోటోలు వైర‌ల్‌..

పూర్ణిమ గారికి, శాంతనుకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

నా ప్రియమైన మిత్రమా… మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అని చిరంజీవి ట్వీట్ చేశారు.