Chiranjeevi : RRR టీంకి చిరు ఘన సన్మానం..

నిన్న నైట్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే పార్టీలో చిరంజీవి (Chiranjeevi) ఆస్కార్ అందుకున్న RRR టీంని సన్మానించాడు.

Chiranjeevi : దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన మల్టీస్టార్రర్ చిత్రం RRR. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అందించిన నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. అంతేకాదు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ (Oscar) ని కూడా గెలుచుకొని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అందుకున్న RRR టీంకి సన్మానం చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వ నాయకులు, సినీ ప్రముఖులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Ram Charan : రామ్‌‍చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా చేసిన ఉపాసన.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్..

అయితే వారందరి కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) RRR బృందానికి సన్మానం నిర్వహించాడు. నిన్న (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఉపాసన గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటు అక్కినేని, దగ్గుబాటి, మంచు, రాజమౌళి, RRR కుటుంబాలతో పాటు టాలీవుడ్ లోని స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. ఇక రామ్ చరణ్ బర్త్ డే పార్టీని కాస్త, చిరంజీవి.. RRR సన్మాన కార్యక్రమంగా మార్చేశాడు.

Ram Charan : రామ్‌చరణ్ బర్త్ డే పార్టీలో సందడి చేసిన కన్నడ దర్శకుడు.. నర్తన్‌తో సినిమా నిజమే!

రాజమౌళి, కీరవాణి, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎస్ ఎస్ కార్తికేయ, నిర్మాత దానయ్యకి సాలువాతో సత్కరించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘భారతీయ సినిమా కోసం తెలుగువారు సాధించిన ఈ ఘనత చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు