Hanuman : హనుమాన్ కోసం చిరంజీవి రాకుంటే ఇంకెవరు వస్తారు.. మెగా ఉత్సవ్ వివరాలు ఇవే..
హనుమాన్ కోసం పరమభక్తుడు చిరంజీవి రాకుంటే ఇంకెవరు వస్తారు. హనుమాన్ మెగా ప్రీరిలీజ్ ఉత్సవ్ వివరాలు ఇవే..
- gum 95921
- Published On : January 4, 2024 / 02:41 PM IST
Chiranjeevi is chief guest for Teja sajja hanuman movie pre release event details
Hanuman : ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రేక్షకుల్లో మూవీ పై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ ధైర్యంతోనే సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాల మధ్యన రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి మరో ధైర్యం తోడవ్వబోతుంది. హనుమాన్ కోసం ఆయన పరమభక్తుడు చిరంజీవి కదిలివస్తున్నారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఆ గ్రాండియర్ లో చిరంజీవి ముఖ్య అతిథి కాబోతున్నారు. జనవరి 7న ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మరి హనుమాన్ సినిమా అంటే చిరంజీవి రాకుంటే ఇంకెవరు వస్తారు. సినిమాని మరింత ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారు.
Also read : Teja Sajja : ‘హనుమాన్’ పెద్ద హిట్ అవ్వాలని తేజ సజ్జాకి.. ఆధ్యాత్మికత ఉంగరం గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
కాగా ఈ సినిమాలో చిరంజీవి కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల రిలీజయిన ట్రైలర్ క్లైమాక్స్ షాట్ లో ఆంజనేయస్వామి కళ్ళు తెరిచినట్టు సీన్ చూపించారు. అయితే ఆ కళ్ళు చూడడానికి చిరంజీవి కళ్ళలా ఉన్నాయంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం పరమ భక్తుడైన చిరంజీవి రూపాని ఇప్పుడు ఉపయోగించారని తెలుస్తుంది. హనుమంతుడి లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుందంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. మరి ఆ లుక్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రివీల్ చేస్తారేమో చూడాలి.
My #GodFather for our #HanuMan ❤️@PrasanthVarma @Primeshowtweets pic.twitter.com/9dyebsLNs5
— Teja Sajja (@tejasajja123) January 4, 2024
కాగా ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మొదటి చిత్రంగా వస్తుంది. ఇది సూపర్ హిట్ అవుతే.. ఈ యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
