Teja Sajja : ‘హనుమాన్’ పెద్ద హిట్ అవ్వాలని తేజ సజ్జాకి.. ఆధ్యాత్మికత ఉంగరం గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

హీరో తేజ సజ్జాకి నిర్మాత అభిషేక్ అగర్వాల్ మహిమాన్విత ఉంగరం బహుమతిగా ఇచ్చారు. 'హనుమాన్' సినిమా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ బహుమతి ఇచ్చారు.

Teja Sajja : ‘హనుమాన్’ పెద్ద హిట్ అవ్వాలని తేజ సజ్జాకి.. ఆధ్యాత్మికత ఉంగరం గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Teja Sajja

Teja Sajja : ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాల్లో హీరో తేజ సజ్జా సినిమా ‘హనుమాన్’ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావాలని తేజకు ఆధ్మాత్మిక ఉంగరం బహుమతిగా ఇచ్చారు ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్.

Koffee With Karan 8 : డేటింగ్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జాన్వీ కపూర్

ఇప్పటివరకు తమ సినిమాలో నటించిన హీరోలకు నిర్మాతలు బహుమతులు ఇచ్చినట్లు విని ఉంటారు. కానీ ఇప్పుడు వేరే నిర్మాత సినిమాలో నటించిన హీరోకి ప్రముఖ నిర్మాత గిఫ్ట్ ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అది మరెవరో కాదు హీరో తేజ సజ్జాకి ‘హనుమాన్’ సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ నిర్మాత అభిషేక్ అగర్వాల్ మహిమాన్విత బంగారపు ఉంగరం బహుమతిగా ఇచ్చారు. అభిషేక్ తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ‘ది కాశ్మీరీ ఫైల్స్’ మూవీకి కూడా అభిషేక్ సహ నిర్మాతగా ఉన్నారు. కాగా తేజ సజ్జాకు అభిషేక్ ఉంగరం గిప్ట్‌గా ఇచ్చిన వార్త వైరల్ అవుతోంది.

Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్‌పై కేసు నమోదు.. మానసిక పరిస్థితి బాగోలేదంటూ..

సంక్రాంతి బరిలో అనేక తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్నిటిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు-గుంటూరు కారం, వెంకటేష్-సైంధవ్, రవితేజ-ఈగల్, నాగార్జున- నా సామి రంగా సంక్రాంతికి విడుదలవుతున్నాయి. వీటితో పాటు తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాపై కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. హనుమంతుడి మహిమలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by PrimeShow Entertainment (@primeshowentertainment)