Chiranjeevi: సినీ విలేఖరులతో “గాడ్‌ఫాదర్” ముచ్చట్లు..
బాస్ అఫ్ అల్ బాస్స్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లో మొత్తం రూ.138 కోట్లు గ్రాస్, రూ.75 కోట్లకు పైగా షేర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విజయంతో మెగా అభిమానులతో పాటు, మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా ఆనందంలో ఉన్నాడు.
- gum 95921
- Published on- October 12, 2022 / 11:50 AM IST
Chiranjeevi met Film Critics Association Members at his House
Chiranjeevi: బాస్ అఫ్ అల్ బాస్స్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లో మొత్తం రూ.138 కోట్లు గ్రాస్, రూ.75 కోట్లకు పైగా షేర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విజయంతో మెగా అభిమానులతో పాటు, మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా ఆనందంలో ఉన్నాడు.
Godfather: సల్లూ భాయ్ కోసం మెగాస్టార్ కాస్ట్‌లీ సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?
ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సినీ విలేఖరులతో సమావేశమయ్యాడు మెగా బాస్. గాడ్‌ఫాదర్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మెంబెర్స్” చిరంజీవి ఇంటికి చేరుకొని అభినందించారు. వారిని ఆప్యాయంగా ఆహ్వానించిన చిరు విజయం పట్ల తన ఆనందాన్ని కూడా పంచుకున్నాడు.
అలాగే చిరు, రవితేజ నటిస్తున్న మెగా154 సినిమా విశేషాలను కూడా మీడియా మిత్రులతో ముచ్చటించాడు. ఈ దీపావళికి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ‘జాలర్లు లీడర్’గా చిరు కనిపిస్తుండగా, రవితేజ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
